మీరేం గొడ‌వ చేయ‌మాకండి. మ‌న‌దే విజ‌యం: కేసీఆర్‌

దీనిపై తాజాగా బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి పెట్టారు. జూబ్లీహిల్స్ ఉప పోరులో మ‌న‌మే గెలుస్తామ‌ని తాజాగా మ‌రోసారి ఆయ‌న వ్యాఖ్యానించారు.;

Update: 2025-11-13 13:27 GMT

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌పై అనేక ఆశ‌లు పెట్టుకున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌కు అనుకూలంగా లేద న్న స‌ర్వే ఫ‌లితాలు.. ఆ పార్టీలో తీవ్ర నిరాశ‌ను నింపాయి. బీఆర్ ఎస్ నాయ‌కులు ఇప్పుడు ఎక్క‌డా క‌ని పించ‌డం లేదు. మ‌రోవైపు.. పార్టీ కీల‌క నాయ‌కుడు, హూజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఎన్నిక‌ల సం ఘం అధికారులు.. కేసు పెట్టారు. ఈ నేప‌థ్యంలో అటు స‌ర్వేల ఎఫెక్ట్‌.. ఇటు నాయ‌కుల ఎఫెక్ట్ కూడా పార్టీపై క‌నిపిస్తోంది.

దీనిపై తాజాగా బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి పెట్టారు. జూబ్లీహిల్స్ ఉప పోరులో మ‌న‌మే గెలుస్తామ‌ని తాజాగా మ‌రోసారి ఆయ‌న వ్యాఖ్యానించారు. స‌ర్వేల‌ను ఎందుకు న‌మ్ముతున్నారు? అని కూడా నాయ‌కు ల‌పై ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ``మాగుంట ఫ్యామిలీ సీటు అది. ప్ర‌జ‌లు ఎందుకు వ‌దులు కుంటారు?`` అని వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది. ఇదే స‌మ‌యంలో ఎవ‌రెవ‌రు.. పార్టీ త‌ర‌ఫున ఎలా ప్ర‌చారం చేశారో కూడా లెక్క‌ల వారీగా ఆయ‌న వివ‌రించారు.

ఇంత ప్ర‌చారం క‌నీవినీ ఎరుగ‌ని విధంగా చేసిన త‌ర్వాత‌.. మ‌న‌కు అనుమానం అవ‌స‌రం లేద‌ని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది. కాంగ్రెస్ నాయ‌కులు కావాల‌నే ప్ర‌చారం చేస్తున్నార‌ని.. బీఆర్ ఎస్ గెలిస్తే.. పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌ని కాంగ్రెస్ నాయ‌కులు భావిస్తున్నార‌ని.. అందుకే విష ప్ర‌చారానికి తెర‌దీ శార‌ని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించిన‌ట్టు నాయ‌కులు చెబుతున్నారు. ``మీరేం గొడ‌వ చేయ‌మాకండి. మ‌న‌దే విజ‌యం`` అని ధైర్యం చెప్పిన‌ట్టు తెలిసింది.

కాగా.. 58 మంది అభ్య‌ర్థులు పోటీ ప‌డిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ఫ‌లితం శుక్ర‌వారం ఉద‌యం తెలిసి పోతుంది. మొత్తం 42 టేబుళ్ల‌లో జ‌రిగే పోలింగ్ కౌంటింగ్ ప్ర‌క్రియ‌ను ప‌ది రౌండ్ల‌లో పూర్తి చేయ‌నున్నారు. ప్ర‌ధానంగా బీజేపీ, బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య పోరు జ‌ర‌గ‌నుంది. మ‌రీ ముఖ్యంగా ఈ ఉప ఎన్నిక‌ను బీఆర్ ఎస్ , కాంగ్రెస్ పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. అయితే.. స‌ర్వేల‌న్నీ.. కూడా ట‌ఫ్ ఫైటే అయినా.. కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News