రాసలీలల వీడియోకు రిజల్ట్ వచ్చేసింది.. డీజీపీ స్థాయి అధికారి సస్పెన్షన్‌!

అవును... కర్ణాటక రాష్ట్ర డీజీపీ స్థాయి అధికారి డాక్టర్‌ రామచంద్రరావు తన కార్యాలయంలో ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా మెలిగినట్లు చూపిస్తున్న వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే.;

Update: 2026-01-20 06:23 GMT

మరికొన్ని నెలల్లో పదవీ విరమణ చేయనున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐపీఎస్ అధికారి.. కర్ణాటక రాష్ట్ర డీజీపీ స్థాయి అధికారి డాక్టర్ రామచంద్రరావు కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో ఆయన తన సీట్లో, యూనిఫామ్ ధరించి.. ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా మెలిగినట్లు ఉన్నారు. ఈ వీడియో సోమవారం ఒక్క రోజులోనే తీవ్ర సంచలనంగా మారింది. ఈ సమయంలో ఆయనను సస్పెండ్ చేశారు.

అవును... కర్ణాటక రాష్ట్ర డీజీపీ స్థాయి అధికారి డాక్టర్‌ రామచంద్రరావు తన కార్యాలయంలో ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా మెలిగినట్లు చూపిస్తున్న వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. సుమారు 40 సెకన్ల నిడివితో ఉన్న ఈ వీడియోలు వైరల్‌ అయ్యాయి. ప్రస్తుతం డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ రైట్స్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ (డీ.సీ.ఆర్‌.ఈ) అధిపతిగా విధులు నిర్వహిస్తున్న రామచంద్రరావు చేసిన పనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయన స్పందించారు.

ఇందులో భాగంగా... ఈ వీడియోలలో ఉన్నది తాను కాదని.. ఎవరో కుట్రపన్ని ఏఐతో తయారు చేసి బయటపెట్టారని.. ఎనిమిదేళ్ల కిందట రికార్డు చేసినవిగా ఇవి కనిపిస్తున్నాయని.. వీటిని విడుదల చేసిన వారిపై ఫిర్యాదు చేసేందుకు న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియోల గురించి తనకు ఏమీ తెలియదని.. దీనిపై విచారణ చేపట్టాలని హోంమంత్రికి మనవి చేసేందుకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. అయితే.. ఆయనకు హోంమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది!

మరోవైపు ఈ వీడియో వ్యవహారంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీరియస్ గా స్పందించారు. ఇందులో భాగంగా.. ఆ అధికారిపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదే సమయంలో.. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచిస్తానని.. దోషిగా రుజువైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రామచంద్రరావు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు మంగళవారం సస్పెషన్ ఉత్తర్వ్యులు జారీ అయ్యాయి.

ఈ సందర్భంగా జారీ చేసిన ఉత్తర్వ్యుల్లో... రామచంద్రరావు ఓ ప్రభుత్వ ఉద్యోగిగా నిబంధనలు ఉల్లంఘించారని.. ఇది ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగా మారిందని.. ఈ క్రమంలోనే ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. సస్పెన్షన్‌ సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా రామచంద్రరావు ఎట్టి పరిస్థితుల్లోనూ హెడ్‌ క్వార్టర్స్‌ ను వదిలి వెళ్లకూడదని ఆ ఉత్తర్వ్యుల్లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

బిస్కెట్ స్మగ్లింగ్ కేసులోనూ ఆరోపణలు...!:

రామచంద్రరావు వివాదాల్లో చిక్కుకోవటం ఇదే తొలిసారి కాదు. గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బంగారు బిస్కెట్ల స్మగ్లింగ్‌ కేసులో దోషి, సినీనటి రన్యారావు సవతి తండ్రి అయిన రామచంద్రరావు సహకారంతోనే స్మగ్లింగ్‌ చేసేవారని ఆరోపణలు వచ్చాయి. దీంతో.. ఆయనను సెలవులపై ఉండాలని సర్కార్ సూచించింది. అయితే.. ఈ కేసులో క్లీన్‌ చిట్‌ రావడంతో గత ఏడాది ఆగస్టులో ఆయన సేవలను ప్రభుత్వం పునరుద్ధరించింది.

ఇదే సమయంలో.. ఆయన సదరన్‌ రేంజ్‌ ఐజీపీగా ఉన్న సమయంలో మైసూరు దక్షిణ పోలీసులు ఓ ప్రైవేటు బస్సును సోదా చేసి రూ.20 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అయితే... తాము తరలించిన మొత్తం రూ.2.27 కోట్లు అని.. పైకి రూ.20 లక్షలే చూపిస్తూ పోలీసులే మిగతా సొమ్మును దాచేసినట్లు ఆరోపించారు. ఈ విషయంలోనూ రామచంద్రరావు పాత్రపై ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ రాసలీలల వీడియో తెరపైకి వచ్చి, సస్పెన్షన్ కు దారి తీసింది!

Tags:    

Similar News