జెన్ జీ ...విను మా మాట !

జెన్ జీ అంటే హద్దులు అన్నీ దాటేసే ఉరకలేయడం అని కొందరు భావిస్తున్నారు. ఫలితాల గురించి ఆలోచన చేయకుండా బరులు తెంచుకుని దూకుడుగా పరుగులు తీయడమే గొప్పతనం అనుకుంటున్నారు

Update: 2026-10-16 19:30 GMT

జెన్ జీ అంటే హద్దులు అన్నీ దాటేసే ఉరకలేయడం అని కొందరు భావిస్తున్నారు. ఫలితాల గురించి ఆలోచన చేయకుండా బరులు తెంచుకుని దూకుడుగా పరుగులు తీయడమే గొప్పతనం అనుకుంటున్నారు. ఎంత కాళ్ళలో సత్తువ ఉన్నా కూడా పరుగులు ఉరుకులూ అన్ని వేళలా గమ్యాన్ని సవ్యంగా చేర్చవు. మధ్యలో ఎత్తు పల్లాలు పడదోస్తాయి. అపుడు ఏకంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఆచీ తూచీ అన్న మాట ఉంది. ఆలోచించి అడుగు వేయాలి. జన్ జీ ఉడుకు నెత్తురుకు వేడి సత్తువకు పడని మాటలు ఎన్నో ఉన్నాయి. అందులో ఆగు అన్నది వారికి నచ్చని పదంగా మారుతోంది అన్న చర్చ ఉంది. అయినా సరే జెన్ జీ వినాలని అంటున్నారు వెనకటి తరం, వారి కంటే ముందు తరం. ఇది గద్దింపు కాదు, బిడ్డలను పెద్దలు సాకుతూ అనే మామూలు మాటగానే చూడాలి. మీ వెనక మేమున్నాం, మీరు మా ముందున్నారు, మీతోనే ఈ దేశం ఉంది. దేశ భవిష్యత్తు మీ చేతల్లో చేతుల్లో ఉంది. కాబట్టి జెన్ జీ వినాలని కోరుతున్నారు. ఇది ప్రేమ పూర్వకమైన అభిమాన కరమైన విన్నపం మాత్రమే.

క్రికెట్ దిగ్గజం సూచన :

భారత్ కి 1983లో ప్రపంచ కప్ ని తెచ్చి నాటికీ నేటికీ యువతకు స్పూర్తిగా నిలిచిన వారు క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్. ఆయన జెన్ జీ తరానికి విలువైన సూచనలు తాజాగా చేశారు. సీజేపీ నిరసనల నేపధ్యంలో ఆయన ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాధ్యత కలిగిన పౌరుడిగా ఈ దేశం కోసం ఎంతో ఆలోచించే సీనియర్ సిటిజన్ గా యువతరాన్ని విశేషంగా ప్రేమించే వ్యక్తిగా జెన్ జీకి ఒక మంచి మాటనే చెప్పారు. జెన్ జీ యువత వినడం నేర్చుకోవాలని కపిల్ దేవ్ అన్నారు. అంతే కాదు మరింత బాధ్యతగా ఉండాలని కూడా కోరారు.

మేమే కరెక్ట్ అంటే :

ఇది జెన్ జీ తోనే కాదు ఈనాటి యువతరంతో వచ్చిన సమస్య గానే ఉందని అంటారు. మాకే అన్నీ తెలుసు, అంతా తెలుసు అన్నది జెన్ జీ భావన అయితే అది అన్ని వేళలా కరెక్ట్ కాదని కపిల్ దేవ్ అంటున్నారు. కొన్ని సార్లు మీది కూడా తప్పు కావచ్చేమో ఆలోచించాలని అంటూ ఆయన దిశా నిర్దేశం చేశారు. మీరు దేశానికి భవిష్యత్తు. రేపటి దేశం మీదే. అయితే మీరు తప్పు దోవ పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా తరం పైన మా మీద ఉందని ఎంతో బాధ్యతాయుతంగా కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దారి ఇవ్వాలి :

ఇక వరల్డ్ ఇండియా ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న క్రీడాకారులు ఢిల్లీ గోల్ఫ్ క్లబ్‌కు వెళ్లేందుకు దారి ఇవ్వాలని నిరసనకారులను ఆయన కోరారు. కపిల్ దేవ్ ఈ విధంగా చేసిన వ్యాఖ్యల వెనక కనుక తరచి చూస్తే ఎంతో లోతైన భావాలే ఉన్నాయని చెప్పాలి. జెన్ జీ యువత గురించి ఆయన మాట్లాడుతూ తెలివి తేటాలు మీకు బాగా ఉన్నాయి. అలాగే స్మార్ట్ గా ఆలోచిస్తారు. కానీ అన్ని వేళలలో రైట్ అని పట్టుబట్టకూడదు కదా అని కూడా చెప్పుకొచ్చారు. అందువల్ల వినడం కూడా అలవాటు చేసుకుంటే జెన్ జీ తరానికి తిరుగు ఉండదని అన్నార్. ఇది అద్భుతమైన భారత దేశం అని ఆయన అంటూ ఈ దేశాన్ని అంతా కలిసి ముందుకు తీసుకుని వెళ్లాలని పిలుపు ఇచ్చారు. మరి విను మా మాట అంటున్నా ఈ దేశంలో ఒక తరం ఇస్తున్న పిలుపుని అందిస్తున్న చేయూతను జెన్ జీ తరం ఉపయోగించుకుంటుందా అన్నదే చూడాల్సి ఉంది మరి.

Tags:    

Similar News