బీఆర్ఎస్ : ఆదాయం రూ.114 కోట్లు .. ఖర్చు రూ.162 కోట్లు

జనరల్ క్యాంపెయినింగ్ కు రూ.137 కోట్లు, ప్రకటనలకు రూ.53.68 కోట్లు, పబ్లిక్ మీటింగుల కోసం రూ.57.51 కోట్లు, జనరల్ క్యాంపెయిన్ కోసం రూ.24.85 కోట్లు, సిబ్బంది జీతాల కోసం రూ.1.53 కోట్లు, నిర్వహణ, సాధారణ మరియు న్యాయసేవల కోసం రూ.16.88 కోట్లు ఖర్చు చేసింది

Update: 2026-10-16 14:09 GMT

భారత రాష్ట్ర సమతి పార్టీ 2025 - 26 సంవత్సరంలో రూ.162 కోట్లు ఖర్చు చేసింది. జనరల్ క్యాంపెయినింగ్ కు రూ.137 కోట్లు, ప్రకటనలకు రూ.53.68 కోట్లు, పబ్లిక్ మీటింగుల కోసం రూ.57.51 కోట్లు, జనరల్ క్యాంపెయిన్ కోసం రూ.24.85 కోట్లు, సిబ్బంది జీతాల కోసం రూ.1.53 కోట్లు, నిర్వహణ, సాధారణ మరియు న్యాయసేవల కోసం రూ.16.88 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో న్యాయ సహాయం కోసం రూ.13.39 కోట్లు వెచ్చించింది.

ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 2025 - 26 అఫిడవిట్లో వివరాలను సమర్పించింది. ఇందులో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం రూ.1.60 కోట్లు, ఇతర ఖర్చుల కోసం రూ.6.84 కోట్లుగా పేర్కొంది.

బీఆర్ఎస్ పార్టీకి మొత్తం ఆస్తులు రూ.1509 కోట్లు ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో రూ.1431 కోట్లు ఉండగా, ఇందులో రూ.1237 కోట్లు సంవత్సరం పైగా మెచ్యూరిటీ ఉన్న లాంగ్ టర్మ్ డిపాజిట్లుగా ఉన్నాయి. ఇతర ఆస్తులు రూ.11.37 కోట్లు, స్థిరాస్తులు రూ.66.26 కోట్లు ఉన్నాయి.

బీఆర్ఎస్ జనరల్ ఫండ్ రూ.1551 కోట్ల నుంచి రూ.1503 కోట్లకు తగ్గింది. 2025 - 26లో ఆదాయం రూ.114 కోట్లు వచ్చింది. రూ.16.44 కోట్లు విరాళంగా, ఫీజుల రూపంలో రూ.27.60 లక్షలు, బ్యాంకు డిపాజిట్ల వడ్డీ, అద్దెల రూపంలో రూ.97.76 కోట్లు వచ్చినట్లు పేర్కొంది.

పార్టీకి ఎక్కువ ఆదాయం డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ ద్వారానే వస్తుంది. 2023లో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత విరాళాలు గణనీయంగా తగ్గిపోయింది. ఇక జాతీయస్థాయిలో 2024 - 25 సంవత్సరానికి బీజేపీ పార్టీకి రూ.6769 కోట్ల ఆదాయం రాగా రూ.3,335 కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్ పార్టీకి 2024 - 25 లో రూ.918 కోట్ల ఆదాయం రాగా, రూ.1112 కోట్లు ఖర్చు చేసింది.

Tags:    

Similar News