• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  5 చోట్ల పోటీకి అప్లికేషన్...

5 చోట్ల పోటీకి అప్లికేషన్ పెట్టుకున్నజీవితా రాజశేఖర్

| నటిగా సుపరిచితురాలు.. ఆ తర్వాత ప్రముఖ హీరో రాజశేఖర్ ను పెళ్లాడిన జీవితా.. తర్వాతి కాలంలో సినీ నిర్మాతగా మారటం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2023-09-14 04:31 GMT

నటిగా సుపరిచితురాలు.. ఆ తర్వాత ప్రముఖ హీరో రాజశేఖర్ ను పెళ్లాడిన జీవితా.. తర్వాతి కాలంలో సినీ నిర్మాతగా మారటం తెలిసిందే. రాజకీయాల మీద తనకున్న ఆసక్తిని ఆమె ఎప్పుడూ దాచి పెట్టలేదు. ప్రతి సందర్భంలోనూ ఆమె తన ఆసక్తిని.. అభిలాషను వ్యక్తంచేసినా.. ఇంతకాలం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది లేదు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమె.. త్వరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తహతహలాడుతున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించే వారంతా తమ అప్లికేష్లను పెట్టుకోవాలని బీజేపీ అధినాయక్తత్వం కోరింది.

ఇందుకు తగ్గట్లే భారీగా అప్లికేషన్లు పార్టీకి చేరాయి. వీటిల్లో సినీ నటి జీవితా రాజశేఖర్ ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి ఆసక్తిని ప్రదర్శించటం కొత్త చర్చగామారింది. ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్ లైన్ లో గుట్టుగా పోటీకి సిద్ధమంటూ అప్లికేషన్లు పెట్టుకున్న వైనం బయటకు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీకి ఆమె సిద్ధమవుతున్నారు. ఆమె ఎంపిక చేసుకున్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హైదరాబాద్ మహానగరంలోనివే కావటం ఆసక్తికరంగా మారింది.

జీవితా రాజశేఖర్ గురి పెట్టిన అసెంబ్లీ నియోజకవర్గాల్ని చూస్తే..

- శేరిలింగంపల్లి

- కూకట్ పల్లి

- సనత్ నగర్

- సికింద్రాబాద్

- జూబ్లీహిల్స్

ఆమె టార్గెట్ చేసిన ఐదు స్థానాల్లో రెండు స్థానాలు నగర శివారులో ఉండగా.. మిగిలిన మూడు మాత్రం హైదరాబాద్ సెంట్రల్ సిటీ పరిధిలోకి వచ్చేవి. సీమాంధ్ర మూలాలు ఉన్నప్పటికీ.. సుదీర్ఘకాలంగా హైదరాబాద్ లోనే సెటిల్ అయిన ఆమె.. తనకున్న సెలబ్రిటీ స్టేటస్ తో ఎన్నికల్లో సానుకూల ఫలితానికి అవకాశం ఉందని ఆశిస్తున్నారు. సినీ గ్లామర్ లో ప్రజల్ని మరింతగా ఆకర్షించేందుకు వీలు ఉంటుందని బీజేపీ భావిస్తోంది. ఇందుకు తగ్గట్లే జీవితా రాజశేఖర్ కు ఆమె కోరుకున్న ఏదో ఒక నియోజకవర్గంలో టికెట్ లభించటం ఖాయమంటున్నారు.

ఆమె ఎంచుకున్న ఐదు నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లి మినహాయితే.. మిగిలిన నాలుగు అసెంబ్లీ స్థానాల్లో చెప్పుకోదగ్గ అభ్యర్థులు లేరు. ఇది ఆమెకు సానుకూలాంశంగా చెబుతున్నారు. జీవితారాజశేఖర్ కు టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలోకి దింపటం ద్వారా.. సినీ పరిశ్రమ నుంచి మరికొందరు మద్దతు లభిస్తుందని.. అదే జరిగితే.. పార్టీకి మేలు చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇటీవల కాలంలో తెలంగాణలో పార్టీకి జరిగిన నష్టాన్ని.. జీవితతో అంతో ఇంతో పూడ్చుకోవచ్చన్న మాట వినిపిస్తోంది. మరి.. జీవితకు ఆమె కోరుకున్న ఐదు స్థానాల్లో ఏ స్థానాన్ని కేటాయిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    
  • Jeevitharajasekhar 
  • BJP 
  • Telangana 
  • Politicalnews 

Similar News

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

Copyright @2026

Powered by Blink CMS