జాతీయ గీతమే ముందు ..కేంద్రం గైడ్ లైన్స్ !

ఇక జాతీయ గీతం ఆలపించే సందర్భంలో ప్రేక్షకులు తప్పనిసరిగా లేచి నిలబడి అటెన్షన్ లో ఉండాలని పేర్కొంది.

Update: 2026-07-12 03:45 GMT

జాతీయ గీతం మనకు ఉంది రాష్ట్ర గీతం కూడా ఉంటుంది. అయితే ఈ రెండింటిలో ఏది ముందు అన్న చర్చ వస్తోంది. దానికి కొన్ని రాష్ట్రాలలో అనుసరించే విధానం బట్టి. ముఖ్యంగా తమిళనాడు విషయం తీసుకుంటే వారు అసెంబ్లీ సమావేశాలలో అయినా ప్రభుత్వ అధికార కార్యక్రమాలలో అయినా ముందు రాష్ట్ర గీతం ఆలపించిన మీదటనే జాతీయ గీతం అని అమలు చేస్తున్నారు. డీఎంకే అధికారంలో ఉన్నపుడు ఈ విధంగానే చేస్తే వరసగా రెండు బడ్జెట్ సెషన్లను ఆనాడు గవర్నర్ గా ఉన్న రవి బాయ్ కాట్ చేసి వెళ్ళిన సందర్భం ఉంది. ఇక విజయ్ సీఎం అయిన తరువాత ప్రమాణం సందర్భంగా జాతీయ గీతం ముందు ఆలపించారు. తరువాత రాష్ట్ర గీతం ఆలపించారు. దాంతో దాని మీద విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే ఏది ముందు ఏది తరువాత అన్న దాని మీద ఫలనాదే తప్పనిసరి అని గైడ్ లైన్స్ లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఉత్పన్నం అవుతోంది అని అంటున్నారు. ఈ క్రమంలో కేంద్రం మార్గదర్శకాలు తాజాగా విడుదల చేసింది.

ఇది తప్పనిసరి అంటూ :

ఇక దేశంలోని రాష్ట్రాలు ప్రభుత్వ కార్యక్రమాలలో గీతాల ఆలాపన క్రమాన్ని కేంద్రం సూచించింది. ముందు జాతీయ గీతంగా జనగణమన ఆలపించాలని ఆ తరువాత జాతీయ గేయం అయిన వందేమాతరం ఆలపించాలని రాష్ట్ర గీతం ఆ తరువాత వరసలో ఉండాలని దిశానిర్దేశం చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని కేంద్రం హోం మంత్రిత్వ శాఖ దేశంలోని వివిధ రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడిన పంపించింది. ప్రతీ అధికార కార్యక్రమాలలో జాతీయ చిహ్నాలు వాటి గౌరవాన్ని కాపాడడం ఏకరూపతను పాటించడం కొసం ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోరింది. ఈ ఉత్తర్వులలో ఇప్పటికే ఉన్న ఆదేశాలని కూడా మరోసారి రిపీట్ చేస్తూ తాజాగా గైడ్ లైన్స్ విడుదల చేసింది.

నిబంధనలు ఈ విధంగానే :

ఇక జాతీయ గీతం ఆలపించే సందర్భంలో ప్రేక్షకులు తప్పనిసరిగా లేచి నిలబడి అటెన్షన్ లో ఉండాలని పేర్కొంది. అదే న్యూస్ రీల్స్ లేదా డాక్యుమెంట్ల ప్రదర్శన సమయంలో జాతీయ గీతం వస్తే అపుడు నిలబడాల్సిన అవసరం లేదని కానీ నిశ్శబ్దం పాటించాలని సూచించింది. ఇది ఎప్పటి నుంచో నిబంధనలుగా ఉన్నా కూడా మరో మారు గుర్తు చేస్తూ గైడ్ లైన్స్ ని తాజాగా పేర్కొంటున్నట్లుగా కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఇక ఈ గైడ్ లైన్స్ ప్రకారం తప్పనిసరిగా ముందు రాష్ట్రగీతం కూడా ఆలపించాల్సి వస్తే అపుడు వందేమాతరం ఆలపించాలని జనగణమన కూడా పూర్తిగా ఆలపించాలని ఈ రెండూ అయ్యాకనే రాష్ట్ర గీతం ఆలపించాలని పేర్కొంది. జాతీయ గౌరవాన్ని కాపాడడానికే ఈ కచ్చితమైన నిబంధలను అని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం జాతీయ గేయం హోదాను కలిగి ఉండగా, రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమన జాతీయ గీతంగా గుర్తింపు పొందింది.

Tags:    

Similar News