• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  యజమానిలో కరువైన...

యజమానిలో కరువైన మానవత్వం.. బ్రతికుండగానే కాటికి తరలించిన వైనం!

| ప్రస్తుత సమాజంలో ఎటువైపు చూసినా ఈ వాక్యాలు నిజమని తెలుస్తున్నాయి. ఈ సమయంలో బ్రతికుండగానే ఓ వక్తిని స్మశానంలో పడుకోబెట్టిన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది.

By - Tupaki Desk
Update: 2025-06-15 10:17 GMT

‘కుక్క నక్కలా దైవ రూపాలుగా కొలిచి.. పంది నందిని జూస్తే పడి మొక్కుతుంటాడు.. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు’.. అని అందెశ్రీ ఏనాడో రాశారు. ప్రస్తుత సమాజంలో ఎటువైపు చూసినా ఈ వాక్యాలు నిజమని తెలుస్తున్నాయి. ఈ సమయంలో బ్రతికుండగానే ఓ వక్తిని స్మశానంలో పడుకోబెట్టిన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... మనిషిలో రోజు రోజుకీ మానవత్వంపాళ్లు తగ్గిపోవడంతో పాటు మూడనమ్మకాలు, స్వార్థపూర్తిత ఆలోచనలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా ఈ రోజుల్లో కూడా ఇంట్లో చనిపోతే మంచిది కాదని.. ఏదో అనర్ధం జరిగిపోతుందని చాలామంది భావిస్తున్నారు. దీంతో.. అద్దెకు ఉంటున్నవారు తీవ్ర అనారోగ్యంతో బాధపడితే వారిని ఇంట్లోకి రానివ్వడం లేదు యజమానులు.

ఇలాంటి సంఘటన తాజాగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణంలో చోటు చేసుకుంది. ఈ హృదయవిదారకమైన ఘటన ప్రతిఒక్కరినీ కదిలిస్తోంది.. ఆ ఇంటి యజమానిని తప్ప! ఈ క్రమంలో.. గత్యంతరంలేక అనారోగ్యానికి గురై, పరిస్థితి విషమించిన ఓ వ్యక్తిని బతికుండగానే స్మశానానికి తరలించారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... ధర్మపురి పట్టణానికి చెందిన రంగు గోపి అనే వక్తి స్థానికంగా హోటల్ నడుపుతూ, అద్దె ఇంట్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో... పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పడంతో.. తిరిగి ధర్మపురిలో అద్దెకు ఉంటున్న నివాసానికి తీసుకువచ్చారు.

దీంతో.. ఆ అద్దె ఇంటి యజమాని గోపి కుటుంబాన్ని లోపలికి అనుమతించలేదు. ఇక మరో గత్యంతరం లేక బతికుండగానే అతడిని స్మశానానికి తరలించిన కుటుంబసభ్యులు.. అక్కడే చాపపై పడుకోబెట్టి సపర్యలు చేస్తున్నారు. దీంతో.. వీరి పరిస్థితిని గమనించిన పట్టణంలోని మున్నూరు కాపు సంఘ సభ్యులు స్పందించి సంఘ భవనంలోకి వారిని తరలించారు.

విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. గోపి కుటుంబానికి పదివేలు స్థానిక నాయకుల ద్వారా అందజేశారు. ఈ సమయంలో... సొంత ఇల్లు లేక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తమ గోడు మంత్రికి విన్నవించుకున్నారు.

Tags:    
  • TelanganaNews 
  • JagityalIncident 
  • HumanityLost 
  • SuperstitionKills 
  • CrematoriumTragedy 
  • SocialInjustice 
  • ShockingIndia 
  • ManAliveAtCrematorium 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS