అమరావతి మహిళలకు అవమానం.. జగన్ స్పందనేదీ?
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతాన్ని `ఓ వర్గం` మహిళలకు రాజధాని అంటూ.. ఓ రాజకీయ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలుదుమారం రేపడం.. తెలిసిందే.;
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతాన్ని `ఓ వర్గం` మహిళలకు రాజధాని అంటూ.. ఓ రాజకీయ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలుదుమారం రేపడం.. తెలిసిందే. దీనిపై రాజధాని ప్రాంత మహిళలతోపాటు.. రాష్ట్ర వ్యాప్తం గా కూడా.. మహిళా సంఘాలు స్పందించాయి. దీనిని ఖండించాయి. ఇక, ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రివర్గంతోనూ.. దీనిపై చర్చించారు. ఈఘటనను, సదరు విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలను కూడా ఖండించారు.
మరోవైపు.. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా.. కఠిన చర్య లు కూడా తప్పవని హెచ్చరించారు. మరి గత 24 గంటలుగా ఇంత జరిగినా.. కూడా.. వైసీపీ అధినేత, ప్రతి పక్ష నాయకుడు.. జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్న. వాస్తవానికి ఈ వ్యాఖ్యల దుమారం రేగింది.. ఆయన సొంత మీడియా సాక్షిలోనే. దానిలో జరిగిన చర్చలోనే.. విశ్లేషకుడు కృష్ణంరాజు.. యాంకర్ కొమ్మి నేని శ్రీనివాసరావు.. తీవ్రస్థాయిలో స్పందించడం తెలిసిందే.
మరి ఈ మీడియాకు బాధ్యుడిగా.. ఉన్న జగన్ కనీసం స్పందించలేదు. పార్టీ తరఫున మహిళలకు మేలు చే స్తున్నామని.. చేశామని చెప్పిన ఆయన.. తమ పార్టీ మహిళా పక్షపాత పార్టీ అని చెప్పుకొనే జగన్.. ఈ విషయంలో మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. కనీసం.. పన్నెత్తు మాట కూడా అనలేదు. వాస్తవానికి జగన్ ఖండన కోసం.. ఆయన మద్దతు కోసం.. మహిళలు ఎదురు చూసిన మాట వాస్తవం. కానీ.. జగన్ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడం.. కనీసం ఆ వ్యాఖ్యలు చేసిన వారిని తప్పుబట్టే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం.