డియర్ షర్మీ...యలహంక వద్దు...లోటస్ పాండ్ తీసుకో !

తన చెల్లెలు వైఎస్ షర్మిలకు వైసీపీ అధినేత జగన్ ఈ నెల 9న రాసిన లేఖ వైసీపీ తాజాగా రిలీజ్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ విషయంలో చేసిన వ్యక్తిగత విమర్శలకు కౌంటర్ గా వైసీపీ ఈ లెటర్ రిలీజ్ చేసింది అని అంటున్నారు.

Update: 2026-10-24 15:13 GMT

తన చెల్లెలు వైఎస్ షర్మిలకు వైసీపీ అధినేత జగన్ ఈ నెల 9న రాసిన లేఖ వైసీపీ తాజాగా రిలీజ్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ విషయంలో చేసిన వ్యక్తిగత విమర్శలకు కౌంటర్ గా వైసీపీ ఈ లెటర్ రిలీజ్ చేసింది అని అంటున్నారు. ఈ లేఖలో మొదటి పదమే డియర్ షర్మీ అని జగన్ సంభోదించడం ఆసక్తిని రేపింది. చెల్లెలు తన కుమార్తె అంజలి పెళ్ళిని యలహంక ప్యాలెస్ లో చేయాలనుకోవడం దానికి జగన్ అడ్డు చెప్పారని ప్రచారం కావడం అది గత కొన్ని రోజులుగా సాగుతోంది. ఇక చంద్రబాబు కూడా కుటుంబ వ్యవహారం అయినా జగన్ మనస్తత్వం గురించి చెప్పక తప్పదు కాబట్టి అంటూ ఈ ఇష్యూ లేవనెత్తారు. దాంతో వైసీపీ జగన్ చెల్లెలుకు రాసిన లేఖ ఇదిగో అంటూ వెంటనే మీడియాకు రిలీజ్ చేసింది.




భద్రత కోసమే అంటూ :

ఈ లేఖలో బెంగళూరులోని యలహంక ప్యాలెస్ ని ఎందుకు వినియోగించుకోవద్దు అని తాను చెబుతున్నాను అన్నది జగన్ వివరించారు. భద్రతాపరమైన అంశాల రిత్యా అక్కడ వివాహ వేదిక వద్దు అని ఆయన సూచించారు. అవసరం అయితే హైదరాబాద్ లోని తన నివాసం అయిన లోటస్ పాండ్ ని ఉపయోగించుకోవాలని జగన్ ప్రతిపాదించారు. తన యలహంక నివాసంలో వివాహం జరిగితే భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతాయని ఇది తనకూ, తన కుటుంబ సభ్యులకూ తీవ్ర ముప్పుగా మారుతుందని జగన్ చెల్లెలుకు రాసిన లేఖలో అందోళన వ్యక్తం చేశారు.

తన నిర్ణయం అదేనంటూ :

కేవలం మేనకోడలు అంజలి విషయమే కాదు తన కుమార్తెలు హర్షా రెడ్డి వర్షా రెడ్డి వివాహ విషయం అయినప్పటికీ కూడా తాను ఇదే నిర్ణయం తీసుకునేవాడిని అని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం తాను ఇక్కడే నివసిస్తున్నాను అని, అందువల్ల ఇలాంటి కార్యక్రమం అనవసరమైన దృష్టిని ఆకర్షించడమే కాకుండా భద్రతాపరమైన సవాళ్లను కూడా కలిగిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇది తన ఇల్లు అని, అక్కడ తనకూ తన కుటుంబ సభ్యులకూ భద్రత ఉండాలని కోరుకుంటున్నాను అని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.

ఆ వేదిక అయితే ఓకే :

ఇదే లేఖలో జగన్ బెంగళూరులోని వేరే వివాహ వేదికలను ఎంచుకోవాలని సూచించార్జు. తన భద్రతను స్వీయ రక్షణ ను దృష్టిలో ఉంచుకుని పరిస్థితిని అర్థం చేసుకుని, వివాహం కోసం వేరే వేదికను ఎంచుకోవాలని కోరుతున్నానని జగన్ చెప్పారు. ఇక తన మేనల్లుడు రాజా వివాహానికి చేసినట్లుగా వేరే ఏదైనా కన్వెన్షన్ సెంటర్‌ను లేదా డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికను ఉపయోగించకూడదని అనుకుంటే హైదరాబాద్ లోని తన లోటస్ పాండ్ నివాసాన్ని ఉపయోగించుకోవచ్చు అని జగన్ మరో ప్రతిపాదన కూడా చేశారు.

ఆలోచించాలన్నదే :

చెల్లెలు షర్మిల కుమార్తె వివాహం కోసం జగన్ తన లోటస్ పాండ్ నివాసాన్ని ఇస్తానని చెప్పడం ద్వారా మరో ఆల్టర్నేషన్ చూపించారు అని అంటున్నారు. అదే సమయంలో యలహంక ప్యాలెస్ ని భద్రతా రిత్యా వద్దు అని చెప్పడం ఈ లేఖలో ముఖ్యాంశాలు. ఎందుకంటే అనేక మంది అపరిచితులు పెళ్ళి పేరుతో వస్తారు అని అందువల్ల తన భద్రతకు ఇబ్బంది అవుతుందని జగన్ అంటున్నారు

ఏమి జరుగుతుంది అన్నది :

ఐతే షర్మిల దీనిని అంగీకరించలేదని అంటున్నారు పైగా వివాహ రిసెప్షన్ ఆహ్వాన పత్రికల్లో కూడా వేదికగా యలహంక నివాసాన్నే ముద్రించారు దాంతో ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే యలహంక ప్యాలెస్ ఉమ్మడి ఆస్తి కాబట్టి ఆమెకు కూడా తగిన హక్కులు ఉన్నయని అంటున్నారు. పైగా పెళ్ళి పత్రికలలో వేదికను ముద్రించి వేరే చోటకు మార్చడం అంటే ఆలోచిస్తారు అని అంటున్నారు. దీంతో జగన్ లేఖలో విన్నపం ఉంది, అదే సమయంలో యలహంక ప్యాలెస్ తప్ప అన్నది కూడా ఉంది అంటున్నారు. దీని మీద ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News