యూఎస్ ఇస్కాన్ టెంపుల్ పై కాల్పులు? అసలేం జరిగింది?

దాదాపు మూడున్నర దశాబ్దాల చరిత్రలో ఎప్పుడూ చోటుచేసుకోని సంఘటనలు ఇటీవల అమెరికాలో జరుగుతున్నాయి.;

Update: 2025-07-02 05:13 GMT

దాదాపు మూడున్నర దశాబ్దాల చరిత్రలో ఎప్పుడూ చోటుచేసుకోని సంఘటనలు ఇటీవల అమెరికాలో జరుగుతున్నాయి. అమెరికాలోని శ్రీశ్రీ రాధా క్రిష్ణ ఇస్కాన్ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. 1990లో ఈ దేవాలయాన్ని అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లోని ఉతాహ్ పరిధిలోని స్పానిష్ ఫోర్క్ లో నిర్మించారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో ఈ దేవాలయం మీద తరచూ దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఈ దేవాలయం మీద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. వీరు కాల్పులు జరిపిన సమయంలో భక్తులు.. అతిధులు ఆలయంలో ఉన్నట్లు ఇస్కాన్ వెల్లడించింది.

సుమారు 20 నుంచి 30 వరకు తూటాలు ఆలయ తోరణాలు.. గోడల్లోకి దూసుకెళ్లాయి. గతంలోనూ ఈ ఆలయంపై దాడులు జరిగ్గా.. గడిచిన నెలలో (జూన్) మాత్రం ఏకంగా మూడుసార్లు దాడులు జరగటం గమనార్హం. తాజాగా జరిపిన కాల్పులు ఆలయానికి తీవ్రంగా నష్టపరిచినట్లుగా ఇస్కాన్ పేర్కొంది. కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని.. భక్తులకు, ఆలయ అధికారులకు తమ మద్దతు ఉంటుందని.. ఈ ఘటనపై స్థానిక అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ కోరింది.

ఇస్కాన్ టెంపుల్ మీద జరిగిన దాడులు.. విద్వేషంతోనే జరిగినట్లు భావిస్తున్నారు. గతంలోనూ దాడులు జరిగినా.. ఇటీవల కాలంలో తరచూ దాడులు జరగటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని దశాబ్దాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకున్నా.. ఇటీవల కాలంలో మాత్రం తరచూ దాడుల ఘటనలు జరుగుతున్నాయని ఇస్కాన్ దేవాలయ అధ్యక్షుడు వాయ్ వార్డెన్ వెల్లడించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో మాత్రమే కాదు గత ఏడాది కాలిపోర్నియాలోని ఇస్కాన్ దేవాలయం మీదా దాడులు జరగటాన్ని గుర్తు చేస్తున్నారు. ఖలిస్థానీ ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా లాస్ ఏంజెల్స్ లోని హిందూ దేవాలయంపై దాడులు జరగటటం గమనార్హం. వరుస పెట్టినట్లుగా అమెరికాలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న కాల్పులపై అమెరికా ప్రభుత్వ స్పందన ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News