ఆగిపోయిన ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ బుకింగ్స్.. అసలు కారణం ఏంటంటే?
మార్కెట్లో ధరలు ఏ రేంజ్ లో ఉన్నా సరే ఆపిల్ ఐఫోన్లకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదు అనే చెప్పాలి.;
మార్కెట్లో ధరలు ఏ రేంజ్ లో ఉన్నా సరే ఆపిల్ ఐఫోన్లకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదు అనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా శాంసంగ్ వర్సెస్ ఆపిల్ అంటూ చిన్న మినీ వార్ జరిగినా సరే ఆపిల్ ఐఫోన్ కొనడానికి చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవలే ఇండియన్ మార్కెట్లోకి ఐఫోన్ 17 సిరీస్ గ్రాండ్ లాంచ్ అయిన విషయం తెలిసిందే.. సెప్టెంబర్ 19వ తేదీ నుండి భారత్ ,అమెరికాలో అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇలాంటి సమయంలో తాజాగా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ బుకింగ్స్ ఆగిపోయాయని తెలిసి అభిమాన కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరో రెండు రోజుల్లో అందుబాటులోకి రానున్న ఈ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ సడన్గా బుకింగ్స్ ఆగిపోవడానికి గల కారణం ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఐఫోన్ 17 సిరీస్ కి ముందస్తు బుకింగ్ జరుగుతోంది. ఈనెల 19 నుంచి వీటిని డెలివరీ కూడా ఇవ్వనున్నారు. వీటిల్లో నారింజ (కాస్మిక్ ఆరెంజ్) రంగుతో ఆపిల్ తీసుకొచ్చిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కి విశేష స్పందన లభిస్తోంది. అయితే ఇప్పుడు బుకింగ్స్ ప్రారంభించిన మూడు రోజుల్లోనే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కి మాత్రమే ఆర్డర్లు తీసుకోవడం ఆపేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. భారత్ ఆపిల్ స్టోర్ లలో పికప్ చేసుకునే సదుపాయంతో కాస్మిక్ ఆరెంజ్ రంగులోని ఐఫోన్ ప్రో మ్యాక్స్ ఐఫోన్ ప్రో సిరీస్ కి ఇప్పుడు ఆర్డర్లు తీసుకోవడం లేదు. భారీ సంఖ్యలో ముందస్తు ఆర్డర్లు రావడమే ఇందుకు ప్రధాన కారణం అని ఆపిల్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. కొన్ని స్టోర్లలో డీప్ బ్లూ రంగు వేరియంట్ కు ఆర్డర్లు తీసుకుంటున్నారు. మొత్తానికైతే ఈ ఆరెంజ్ కలరు కస్టమర్లను బాగా ఆకట్టుకోవడంతోనే ముందస్తుగానే దీనిని బుకింగ్ చేసుకున్నారట.. అందుకే ఇప్పుడు బుకింగ్స్ తీసుకోవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
వీటి ధరల విషయానికొస్తే.. ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ ను రూ.82,900 - రూ.2,29,900 ధరల శ్రేణిలో విడుదల చేసింది. ఇక ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి సెప్టెంబర్ 19వ తేదీ నుంచి కంపెనీ ఫోన్ లను అందించనుంది. ఐఫోన్ 17 సిరీస్ విషయానికి వస్తే.. ఐఫోన్ 17 , ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అంటూ కొన్ని ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.. వీటితోపాటు ఆపిల్ అల్ట్రా స్లిమ్ ఐఫోన్ ఎయిర్, ఆపిల్ వాచ్ సిరీస్ 11, ఆపిల్ వాచ్ ఎస్ ఈ 3తో పాటు ఎయిర్ పాడ్స్ ప్రో 3 ఇయర్ బడ్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది.. ధరలు కూడా అదే రేంజ్ లోనే కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే ఈసారి 128gb కి బదులు 256gb స్టోరేజ్ తో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.