టెస్ట్ లో ఫెయిల్ అయిన ఐఫోన్ 17..ఇదిగో సాక్ష్యం!
ఐఫోన్ యూజర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ ఈవెంట్ ఇటీవల ఆపిల్ పార్కులో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.;
ఐఫోన్ యూజర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ ఈవెంట్ ఇటీవల ఆపిల్ పార్కులో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ లో భాగంగా పలు మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఆపిల్. అలా అందుబాటులోకి వచ్చిన మోడల్స్ సెప్టెంబర్ 19 నుంచి ఇండియా మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు. రేపటి నుంచి ప్రీ ఆర్డర్లు సైతం ప్రారంభించేలా ఆపిల్ సంస్థ ప్లాన్ చేసింది. ధర విషయానికి వస్తే రూ.82,900 నుంచి రూ.2,29,900 రూపాయల వరకు ఉంటుంది. ఐఫోన్ ఎయిర్ పేరిట చాలా సన్నని మొబైల్ ని ప్రవేశపెట్టింది. కేవలం 5.6 mm మందంతో ఈ మొబైల్ కలదు. ఈ మొబైల్ ఈ - సిమ్ లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
ఐఫోన్ 17 మోడల్స్ మొబైల్స్ లో 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ని ఆపివేసింది. ఐఫోన్ 16 సిరీస్ తో పోలిస్తే 17 బేస్ మోడల్ ధర కూడా భారీగానే పెరిగింది. ఇండియాతో సహా సుమారుగా 63 దేశాలలో సెప్టెంబర్ 12 నుంచి ఐఫోన్ 17 ప్రో, ప్రోమ్యాక్స్ మొబైల్ ప్రీ ఆర్డర్ చేసుకొని సదుపాయాన్ని కల్పించింది.
అంతా బాగానే ఉన్నా.. ఐఫోన్ తన సిరీస్ ను లాంచ్ చేసేముందు ప్రతిసారి కూడా తమ మొబైల్ ను రివ్యూల కోసం టెస్ట్ చేయడానికి కొంతమంది ఇన్ఫ్లు యెన్సర్ కు మొబైల్స్ ని అందిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా ఐఫోన్ సిరీస్ మోడల్స్ ను టెస్ట్ కోసం ఇన్ఫ్లుయెన్సర్ లకు అందించింది ఐఫోన్. అయితే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఐఫోన్ 17 సిరీస్ లో మొదటిదైన ఐఫోన్ 17 ప్రో మొబైల్ టెస్ట్ చేయగా.. స్క్రీన్ పగిలిపోయినట్లు మనం చూడవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆ వీడియోని సదరు ఇన్ఫ్లుయెన్సర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు.
వీడియో విషయానికి వస్తే.. ఐఫోన్ 17 సిరీస్ లో భాగంగా.. ఐఫోన్ 17 ప్రో మోడల్ ను కార్ చక్రాల కింద పెట్టి.. టెస్ట్ చేయగా స్క్రీన్ మొత్తం ఒక్కసారిగా పగిలిపోయింది. ఆ తర్వాత ఐఫోన్ 17 ప్రో మాక్స్ మోడల్ ను టెస్ట్ చేయగా కొంతవరకు కార్నర్ లో స్క్రీన్ పగిలిపోవడం చూపించారు. ఆ తర్వాత న్యూ ఆపిల్ వాచ్ ను టెస్ట్ చేయగా.. అది కూడా టెస్ట్ లో ఫెయిల్ అయింది. ఇక ఆఖరికి ఆపిల్ ల్యాప్ టాప్ ని కూడా టెస్ట్ చేయగా.. ఇలా ఏవి కూడా టెస్ట్ పాస్ అవ్వలేదు. మొత్తానికైతే ఐఫోన్ 17 సిరీస్ ఇప్పుడు టెస్ట్ లో ఫెయిల్ అయిందని ఆ వీడియోలో చూపించేశారు.కంపెనీ చెప్పిన వాటిలో ఏవీ కూడా టెస్ట్ పాస్ అవ్వలేదు అని.. మొత్తం ఫెయిల్ అన్నట్లుగా వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో క్షణాలలో వైరల్ గా మారుతోంది.