భారీ కార్ యాక్సిడెంట్.. ప్రాణాలు కోల్పోయిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని!
హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పై ఒక ఇన్నోవా కారు పల్టీలు కొట్టి బోల్తా పడింది.;
ప్రమాదం ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో చెప్పడం అసాధ్యం. అందుకే బయటకు వెళ్లిన వారు క్షేమంగా ఇంటికి వచ్చేవరకు గుండెల్లో గుండెగా బ్రతుకుతూ ఉంటారు వారి కుటుంబ సభ్యులు. చుట్టుపక్కల నుంచి ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియని పరిస్థితి. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక భారీ కార్ యాక్సిడెంట్ జరగగా ఇన్ఫోసిస్ ఉద్యోగిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం.. ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగులుస్తోంది. అయితే ఆ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పై ఒక ఇన్నోవా కారు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని సౌమ్యారెడ్డి అక్కడికక్కడే మరణించగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే విషయానికి వస్తే.. ఇన్ఫోసిస్ ఉద్యోగిని సౌమ్యారెడ్డి తన సహోద్యోగులు ఏడు మందితో కలిసి ఆమె సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా.. అబ్దుల్లాపూర్మెట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వీరేంద్ర, నందకిషోర్, అరవింద్ సాగర్, ఝాన్సీ , శృతి, ప్రణీష్ గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలు సౌమ్యారెడ్డి స్వస్థలం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గా పోలీసులు గుర్తించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ప్రమాదం విషయానికి వస్తే.. పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు పై ఆదివారం అర్ధరాత్రి ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పోచారం వైపుగా వెళ్తున్న ఒక ఇన్నోవా కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలోనే ఇన్ఫోసిస్ ఉద్యోగి అయిన సౌమ్య రెడ్డి అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించగా.. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. అయితే పోలీసులు మాత్రం అతివేగం, డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉండవచ్చు అని పోలీసులు ప్రాథమిక విచారణలో అనుమానిస్తున్నారు..ఇక ప్రమాదానికి గురైన కారు నంబర్ TS07 FQ 3399 గా గుర్తించారు. బాధిత కుటుంబాలకు ప్రమాదం గురించి సమాచారం అందించారు. గాయపడ్డ వారికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు