ఈ బిచ్చగాడు బంగారు వ్యాపారులకు అప్పులిస్తాడు.. ఎక్కడంటే?

అవును.. మీరు చదివింది నిజమే. అందరూ అలా ఉంటారని కాదు కానీ బిచ్చగాళ్లలోనూ కొందరు సంపన్న బిచ్చగాళ్లు ఉంటారు.;

Update: 2026-01-19 06:16 GMT

అవును.. మీరు చదివింది నిజమే. అందరూ అలా ఉంటారని కాదు కానీ బిచ్చగాళ్లలోనూ కొందరు సంపన్న బిచ్చగాళ్లు ఉంటారు. చూసినంతనే అయ్యో పాపం.. మనం ఆదుకోకుంటే ఇంకెవరు ఉంటారన్న భావన కలిగేలా కొందరు ఉంటారు. అలాంటి బిచ్చగాళ్లలో కొందరు సంపన్న బిచ్చగాళ్లు ఉంటారు. వీరి సంపదకు సంబంధించిన వివరాలు బయటకు రావు. ఎప్పుడో ఒక ప్రత్యేక సందర్భంలో బయటకు వచ్చి.. అందరిని విస్మయానికి గురి చేస్తుంటారు. తాజాగా ఆ తరహా ఉదంతమే ఇండోర్ లో చోటు చేసుకుంది.

ఇండోర్ ను బిచ్చగాళ్ల రహిత సిటీగా మార్చాలన్న ఉద్దేశంతో అక్కడి అధికారులు ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టారు. ఇందులో భాగంగా 6500 మందిని గుర్తించి.. వారికి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి.. పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ క్రమంలో సరాఫ్ బజారు వద్ద చక్రాల బండిలో భిక్షాటన చేసే మంగీలాల్ అనే దివ్యాంగుడ్ని గుర్తించారు.

అతడ్ని విచారించే క్రమంలో అధికారులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు వెలుగు చూశాయి. మంగీలాల్ అలాంటి ఇలాంటి రిచ్ కాదు. అతను కొందరు బంగారు వర్తలకు వడ్డీలకు అప్పులు ఇస్తాడని గుర్తించారు. అంతేకాదు.. అతనికి ఇండోర్ లో మూడు ఇళ్లు ఉన్నట్లు తేల్చారు. అంతేకాదు.. ఇండోర్ సిటీ దాటితే.. తన స్విఫ్ట్ డిజైర్ కారు తప్పించి మరే వాహనాన్ని వాడడన్న విషయాన్ని గుర్తించారు. అంతేకాదు.. డ్రైవర్ ను పెట్టుకొని కారును వాడతారన్న విషయం అధికారుల దృష్టికి వచ్చింది.

ఇతడికి ఉన్న మూడు ఇళ్లలో ఒకటి రెడ్ క్రాస్ సొసైటీ నుంచి దివ్యాంగుడి కోటాలో ఉచితంగా పొందినది కూడా ఉండటం గమనార్హం. వీటితో పాటు మూడు ఆటోలు కొని అద్దెలకు తిప్పుతుంటాడని తేల్చారు. ఇతడ్ని మరింత లోతుగా విచారించి.. ద్యాప్తు చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. స్థానికంగా మంగీలాల్ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News