విమానంలో చెంపదెబ్బ తిన్న వ్యక్తి తండ్రి షాకింగ్ వ్యాఖ్యలు!

ముంబై నుంచి కోల్ కతా వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు, మరో ప్రయాణికుడిపై చెంప దెబ్బ కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.;

Update: 2025-08-02 09:51 GMT

ముంబై నుంచి కోల్ కతా వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు, మరో ప్రయాణికుడిపై చెంప దెబ్బ కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈక్రమంలో విమానంలో చెంపదెబ్బ తిన్న ప్రయాణికుడు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని అతడి కుటుంబసభ్యులు తెలిపినట్లు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

అవును... ఇండిగో విమానంలో సహ ప్రయాణికుడి చేతిలో చెంపదెబ్బ తిన్న ప్రయాణికుడు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అతడి కుటుంబసభ్యులు తెలిపినట్లు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆ వ్యక్తిని అస్సాంలోని కాచార్ జిల్లాకు చెందిన హుస్సేన్ అహ్మద్ మజుందార్ (32) గా అతని కుటుంబ సభ్యులు గుర్తించారు. దాడి చేసిన వ్యక్తిని హఫీజుల్ రెహమాన్‌ గా గుర్తించారు.

వాస్తవానికి కోల్‌ కతాలో విమానం ల్యాండ్ అవ్వగానే హఫీజుల్ ను పోలీసులకు అప్పగించారు.. తరువాత అతన్ని విడుదల చేశారు. మరోవైపు హుస్సేన్ మాత్రం ఇంటికి చేరుకోకపోవడంతో అతని కుటుంబం ఆందోళన చెందింది. ఈ క్రమంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. అతను ఇంకా రాలేదని, తమకు ఫోన్ చేయలేదని, మరోవైపు అతని ఫోన్ స్విచ్ ఆఫ్‌ లో ఉందని చెప్పారు.

ఈ సందర్భంగా స్పందించిన హుస్సేన్ తండ్రి హుస్సేన్‌ తండ్రి అబ్దుల్‌ మన్నన్‌ మజుందార్‌.. తమ కుమారుడు ముంబైలోని ఓ హోటల్‌ లో పనిచేస్తున్నాడని.. పలుమార్లు ఇదే మార్గంలో ఇంటికి వచ్చేవాడని.. ఈసారి ఎప్పటిలాగానే అతడి కోసం ఎయిర్‌ పోర్టుకు వెళ్లామని తెలిపారు. అయితే.. అతడు అక్కడ కన్పించలేదని.. ఆ తర్వాత వీడియో ద్వారా గొడవ గురించి తెలిసిందని అన్నారు.

కాగా... ముంబై నుంచి నుంచి కోల్‌ కతా వెళ్తున్న ఇండిగో విమానంలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఓ ప్రయాణికుడు మరో ప్రయాణికుడి చెంపపై బలంగా కొట్టాడు. దీంతో విమానంలో ఒక్కసారిగా తీవ్ర ఆందోళన పరిస్థితి నెలకొంది. ఈ ఇష్యూ వైరల్ గా మారింది.

ఆ సమయంలో... అసలెందుకు కొట్టారని.. కొట్టే హక్కు మీకు ఎవరిచ్చారంటూ ఇతర ప్రయాణికులు, దాడికి పాల్పడిన వ్యక్తిని ప్రశ్నించారు. ఈ ఘటనపై పైలెట్లు విమానాశ్రయానికి సమాచారం అందించడంతో... విమానం కోల్ కతాలో ల్యాండ్ అవ్వగానే అతడిని భద్రతా సిబ్బందికి అప్పగించినట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది.

Tags:    

Similar News