కౌర్ నూర్ గా మారిన వేళ.. తొలుత మిస్సై తర్వాత పాక్ లో మిస్సెస్ అయ్యారు!

భారత్ లో ఉన్న ప్రియుడి కోసం పాకిస్థాన్ లో ఉన్న ఇళ్లు అమ్మేసుకుని, భర్తను వదిలేసి, పిల్లలతో సహా భారత్ కు వయా దుబాయ్, నేపాల్ వచ్చిన మహిళ ప్రేమ కథ వ్యవహారం తెలిసిందే!;

Update: 2025-11-15 06:30 GMT

భారత్ లో ఉన్న ప్రియుడి కోసం పాకిస్థాన్ లో ఉన్న ఇళ్లు అమ్మేసుకుని, భర్తను వదిలేసి, పిల్లలతో సహా భారత్ కు వయా దుబాయ్, నేపాల్ వచ్చిన మహిళ ప్రేమ కథ వ్యవహారం తెలిసిందే! అయితే... ఇప్పుడు చెప్పుకోబోయే కథ ప్రేమ కథ కాదు కానీ... పంజాబ్ లో మిస్సైన ఓ భారత మహిళ పాకిస్థాన్ లో తొలుత మతం మార్చుకుని, తర్వాత అక్కడి ఓ వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు!

అవును... సిక్కుల అత్యున్నత సంస్థ అయిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ప్రతీ ఏటా పాకిస్థాన్ లోని చారిత్రాత్మక గురుద్వారాలకు.. ప్రధానంగా గురునానక్ ప్రకాష్ పర్వ్ కు నివాళులు అర్పించడానికి యాత్రికుల బృందాన్ని పంపుతుంది! ఈ క్రమంలో ఇటీవల 10 రోజుల యాత్ర కోసం పాక్ కు ఓ బృందం వెళ్లింది. అయితే, ఆ బృందంలో ఓ మహిళ మిస్సైపోయింది.. తాజాగా మిస్సెస్స్ అయ్యింది!

వివరాళ్లోకి వెళ్తే... పంజాబ్ లోని కపుర్తలా నివాసి అయిన 52 ఏళ్ల సరబ్ జిత్ కౌర్, ఇతర సిక్కు యాత్రికులు నవంబర్ 4న వాఘా-అట్టారీ సరిహద్దును దాటి పాక్ లోకి ప్రవేశించారు. ఈ ఏడాది గురునానక్ ప్రకాష్ పర్వ్ 555వ జయంతిని పురస్కరించుకుని ఈ సందర్శనకు అనుమతి లభించింది. ఈ బృందంలో 1992 మంది సిక్కు యాత్రికులు పాక్ లో 10 రోజులు గడిపిన తర్వాత నవంబర్ 13న భారత్ తిరిగి వచ్చింది.

అయితే.. అలా తిరిగివచ్చిన వారిలో సరబ్ జిత్ కౌర్ లేరు. దీంతో.. ఇమ్మిగ్రేషన్ విభాగం వెంటనే పంజాబ్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ సమయంలో.. పోలీసులు ఇతర భారతీయ ఏజెన్సీలకు కూడా సమాచారం అందించారు. ఆమె అదృశ్యంపై పాకిస్థాన్ అధికారులతో భారత అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఓ కీలక విషయం తెరపైకి వచ్చింది.

ఆమె ఇస్లాం మతంలోకి మారి, లాహోర్ కి సమీపంలోని షేక్ పురా నివాసి అయిన నాసిర్ హుస్సేన్ ను వివాహం చేసుకున్నట్లు ఉర్దూలో ఇస్లామిక్ వివాహ ఒప్పందం బయటపడిందని అంటున్నారు. ఈ క్రమంలో.. ఆమె వివాహానికి ముందే ఇస్లాం మతంలోకి మారి తన పేరును నూర్ గా మార్చుకున్నారని అంటున్నారు.

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆమె భర్త నుంచి ఇప్పటికే విడాకులు తీసుకున్నారు. సుమారు 30 ఏళ్లుగా ఇంగ్లాండ్ లో ఆమె మాజీ భర్త కర్నెల్ సింగ్ తో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.

Tags:    

Similar News