మోడీ పచ్చ జెండా కోసం వెయిటింగ్ !
ఉత్తరాంధ్రాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అన్ని పనులూ పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తోంది.
ఉత్తరాంధ్రాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అన్ని పనులూ పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తోంది. మరి కొద్ది రోజులలో ఈ ఎయిర్ పోర్టు తన ఆపరేషన్స్ ని స్టార్ట్ చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ ఎయిర్ పోర్టుని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ప్రధానమంత్రి కార్యాలయం వైపు అంతా చూస్తున్నారు.
ఈ డేట్ మీదనే ఫోకస్ :
జూలై 5 డేట్ మీదనే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే జూలై 4న అల్లూరి సీతారామరాజు జయంతి. ఈ ఇంటర్నేషనల్ పోర్టుకు అల్లూరి పేరు పెట్టారు. దాంతో ఆయన స్పూర్తితో ప్రారంభించుకోబోయే ఈ పోర్టు ఒక రోజు అటు ఇటుగా ఆయన జయంతి వేళ శ్రీకారం చుట్టుకోవాలని ప్రభుత్వ వర్గాల అభిలాషగా ఉంది. దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 5న ఎయిర్ పోర్టుని ప్రారంభించడానికి గల అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. జూలై 5 డేట్ ని ఫిక్స్ చేస్తే బాగుంటుంది అన్నదే అందరి అభిప్రాయంగా ఉంది. ఇదిలా ఉంటే భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం కోసం జూలై 5 తేదీని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా చెబుతున్నారు. ఆ రోజున ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవాన్ని ఘనంగా చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తేదీన తాము అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కార్యాలయానికి తెలిపింది. ఒక వేళ ఈ తేదీ ప్రధానికి కుదరదు అనుకుంటే వేరే పీఎంఓ సూచించే ఏ తేదీకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
అతి పెద్ద గ్రీ ఫీల్డ్ ఎయిర్ పోర్టు :
ఇక భోగాపురం ఎయిర్ పోర్టు చూస్తే అతి పెద్ద గ్రీన్ ఫీల్డ్ గా నిర్మించారు. 2,200 ఎకరాలలో అయిదు వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయం ప్రారంభం అయితే ఉత్తరాంధ్రకే కాదు ఏపీకే కొత్త కళ వస్తుందని భావిస్తున్నరు. ఇక భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి ప్రధాన రహదారి కారిడార్ల పనులు 98 శాతం మేర పూర్తి చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. ప్రారంభించిన వెంటనే విమానాశ్రయం తన కార్యకలాపాలకు పూర్తిగా సిద్ధంగా ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
60 లక్షల మంది ప్రయాణీకులు :
ఇదిలా ఉంటే జీఎమ్మార్ గ్రూప్ ఈ విమానాశ్రయాన్ని నిర్మించింది. ఈ అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేయబడిన ఈ విమానాశ్రయంలో సంవత్సరానికి దాదాపు 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తారు అని అంచనా వేస్తున్నారు. 77 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టెర్మినల్‌లో 40 చెక్-ఇన్ కౌంటర్లు 26 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఉంటాయి. ఇక భోగాపురం విమానాశ్రయం విజయనగరం జిల్లాకు అభివృద్ధి చోదకంగా పనిచేస్తుందని ఆ ప్రాంత వాసులు బలంగా నమ్ముతున్నారు. మరో వైపు చూస్తే శ్రీలంక, మలేషియా, థాయిలాండ్ వంటి తర దేశాలకు విమానాలను నడపడానికి చర్యలు తీసుకోవాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తాజాగా కోరారు. విశాఖపట్నం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి ప్రయాణించే విమాన ప్రయాణికులపై భారాన్ని తగ్గించడానికి, దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ టాక్సీ బైక్ ఆపరేటర్లతో స్థిరమైన చార్జీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని కూడా అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.