ఎగిసిన 'పడిన' నక్సల్సిజం!!
అనేక పోరాటాలు.. నక్సలైట్‌లను రాటు దేల్చాయి. అనేక మంది ప్రజాప్రతినిధులు..(తెలంగాణలో అప్పటి హోం మంత్రి మాధవ రెడ్డి) నక్సలైట్ల దాడుల్లోనే ప్రాణాలు కోల్పోయారు.;
నక్సలిజం.. సుమారు 4 దశాబ్దాలుగా ఈ దేశాన్ని కుదిపేసిన సాయుధ పోరాటం!. బడుగుల కోసం.. వారి భవిత్యవం కోసం.. భాకామందుల పీచమణిచి.. గిరిజనులు.. అణగారిని సామాజిక వర్గాల తరఫున బలమైన సాయుధ దళంతో పోరు సల్పేందుకు తెరమీదికి వచ్చిన మావోయిస్టులు.. ఇప్పుడు దాదాపు అంతరించి పోయారనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం.. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయడం ఖచ్చితంగా కనిపిస్తోంది.
అనేక పోరాటాలు.. నక్సలైట్‌లను రాటు దేల్చాయి. అనేక మంది ప్రజాప్రతినిధులు..(తెలంగాణలో అప్పటి హోం మంత్రి మాధవ రెడ్డి) నక్సలైట్ల దాడుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది భద్రతా సిబ్బంది అశువులు బాసారు. అయితే.. మావోయిస్టులు జరిపిన దాడులు కానీ.. వారు పెట్టుకున్న లక్ష్యాలు కానీ.. అణగారిని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాయా? అంటే.. లేదనే చెప్పాలి. ఇదే.. వారికి పెద్ద మైనస్‌గా మారింది.
సాయుధ పోరును నమ్ముకున్న ఏ ఉద్యమం కూడా ప్రపంచ చరిత్రలో విజయం దక్కించుకున్న పరిస్థితి ఇప్పటి వరకు కనిపించలేదు. ఈ పరంపరంలో సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా దేశాన్ని ముఖ్యంగా 14 రాష్ట్రాలను చివురుటాకులా వణికేలా చేసిన నక్సలిజం అంతానికి 2000 సంవత్సరంలో బీజం పడింది. అప్పట్లోనే కేంద్రం సైనిక పోరుకు పిలుపునిచ్చింది. అయితే.. ఆర్మీ నిబంధనలు ఒప్పుకోని కారణంగా.. సైన్యం తప్పుకొంది.
ఆ తర్వాత.. వచ్చిన యూపీఏ ప్రభుత్వం కూడా ఇదే దిశగా సాగింది. కానీ.. అంత సక్సెస్ కాలే. కానీ, గత 2017లో తీసుకువచ్చిన ఆపరేషన్ కగార్ తొలినాళ్లలో అనుకున్నంత విజయం దక్కించుకోకపోయినా.. తర్వాత కాలంలో మోడీ సర్కారు కఠినంగా వ్యవహరించిన దరిమిలా.. మావోయిస్టులకు మరో మార్గం లేకుండా పోయిది. దీంతో లొంగుబాటా.. ప్రాణాలు కోల్పోవడమా? అనే రెండు దారులే వారి ముందు నిలిచాయి. ఫలితంగా నేడు.. అనేక మంది లొంగుబాటు బాట పట్టారు. మరికొందరు మరణసయ్య ఎక్కారు. మొత్తానికి ఎగిసిన మావోయిజం.. నక్సలిజం.. ఇప్పుడు అంతే వేగంగా పడిపోయింది.