అంత తీవ్రమైన భూకంపం వేళలోనూ మాస్కో సేఫ్ అదెలా?

రష్యాలో చోటు చేసుకున్న భయంకర భూకంపం ఆ దేశాన్ని మాత్రమే కాదు అమెరికా.. జపాన్ తో పాటు పలు దేశాల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.;

Update: 2025-07-31 04:44 GMT

రష్యాలో చోటు చేసుకున్న భయంకర భూకంపం ఆ దేశాన్ని మాత్రమే కాదు అమెరికా.. జపాన్ తో పాటు పలు దేశాల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. చరిత్రలోనే అత్యంత భారీ భూకంపాల జాబితాలో ఆరో స్థానంలో నిలిచిన ఈ భూకంపం ధాటికి రష్యా రాజధాని మాస్కో మీద ఎలాంటి ప్రభావాన్ని చూపకపోవటం ఆసక్తికరంగా మారింది. రిక్టర్ స్కేల్ మీద 8.8 తీవ్రతతో ఉన్న ఈ తీవ్ర భూకంప ప్రభావం రష్యా దేశ రాజధాని నగరాన్ని కించిత్ కూడా ఎఫెక్టు చేయలేకపోవటం ఏమిటి? దాని వెనుకున్న అసలు కారణం ఏమిటన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ భారీ భూకంపం ధాటికి రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్.. కామ్ చాట్స్క్ నగరానికి 119 కిలోమీటర్ల దూరంలో సంభవించిన ఈ భూకంపం కారణంగా పలు దేశాలు వణికిన పరిస్థితి. సిత్రంగా.. రష్యా రాజధాని మాస్కోకు ఎలాంటి ఎఫెక్టు లేకపోవటం ఏమిటి? దాని వెనకున్న అసలు కారణం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగామారింది.దీనికి జవాబు చూస్తే..తాజా భారీ భూకంప కేంద్రానికి రష్యా రాజధాని మాస్కో నగరం 6800కిలో మీటర్ల దూరంలో ఉంది.

భౌగోళికంగా ఇదో కలిసి వచ్చే అంశమైతే.. మాస్కో క్రియాశీల టెక్టోనిక్ ప్లేట్ లిమిట్స్ కు దూరంగా ఉండటం కూడా ఒక కారణంగా చెప్పాలి. ఈ కారణంతోనే ఇప్పటివరకు పెద్ద భూకంపాలు ఏవీ కూడా మాస్కోను ఏమీ చేయలేదు. తాజాగా కమ్ చట్కా ద్వీపకల్పాన్ని తాకిన భూకంప భూ ప్రకంపనలు మాస్కోను ఎలాంటి ప్రభావం చేయలేవని.. ఎందుకంటే భూకంప తీవ్రత మాస్కోకు వచ్చేసరికి బలహీనమై.. వాటి శక్తిని కోల్పోతుందని చెబుతున్నారు. భూకంపాలకు అత్యంత సేఫ్ జోన్ లో మాస్కో ఉందని చెప్పాలి. ఇదంతా చూస్తే.. మాస్కో మహానగరం ప్రకృతి నుంచి ప్రత్యేక వరం పొందినట్లుగా అనిపించట్లేదు?

Tags:    

Similar News