8గంటలు కాదు 13గంటలు.. పనిదినాల పెంపుపై కార్మికుల సమ్మె!

ఇదిలా ఉండగా ఇప్పుడు మరొకసారి కార్మికుల సమ్మె భగ్గుమన్నది. పని గంటల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు సమ్మెకు దిగారు.;

Update: 2025-10-03 13:30 GMT

సాధారణంగా ఎవరైనా సరే తమకు పని ప్రదేశాలలో అనుకూలంగా ఉంటేనే పనులు నిర్వర్తిస్తారు అన్న విషయం తెలిసిందే. కానీ ఏదైనా బెడిసి కొడితే మాత్రం ఏకంగా సమ్మె చేయడానికి కూడా వెనుకాడరు.. ఉదాహరణకు. గత కొన్ని రోజుల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల సమ్మె సినిమాలపై ఏ రేంజ్ లో నష్ట ప్రభావాన్ని చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దశాబ్దాల తరబడి పనిచేస్తున్న తమకు జీతాల పెంపు లేదని, 30% జీతం పెంచితేనే సవ్యంగా సినిమా షూటింగ్లకు హాజరవుతామని, ఎవరైతే తమ నిబంధనలను ఒప్పుకుంటారో వారి సినిమాలకు మాత్రమే పనిచేస్తామని ఇలా పలు డిమాండ్లను ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

అయితే కార్మికుల యూనియన్ వల్లే అటు కార్మికులకు ఇటు కొత్తవారికి అన్యాయం జరుగుతోందని.. కొత్త వాళ్ళు ఇండస్ట్రీలోకి రావాలి అంటే యూనియన్ లో సభ్యత్వం ఉండాల్సిందే అని.. ఈ సభ్యత్వాని కోసం కొత్తవాళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. పైగా ఒకేసారి 30% జీతం పెంపు అంటే చిన్న నిర్మాతలకు నష్టం వాటిల్లుతుంది అని బడానిర్మాతలు దీనిపై పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. అయితే ఎట్టకేలకు విడతల వారీగా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా ఇప్పుడు మరొకసారి కార్మికుల సమ్మె భగ్గుమన్నది. పని గంటల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ సినిమా షూటింగులు ఆగిపోతాయా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండగా.. ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.. ఈసారి సినీ కార్మికుల సమ్మె కాదు.. పైగా ఈ సమ్మె నిరసనలు గ్రీస్ లో మంటలు రేకెత్తిస్తున్నా.

అసలు విషయంలోకి వెళ్తే.. కార్మిక చట్టాలలో మార్పులు చేసేందుకు గ్రీస్ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా షిఫ్ట్ లో పనిగంటలను ఎనిమిది గంటలకు బదులు 13 గంటలకు పెంచడంపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో భాగంగానే కార్మిక సంఘాలు 24 గంటలు సమ్మెకు పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది.

తాజాగా గ్రీస్ ప్రభుత్వం కార్మిక చట్ట సవరణలలో షిఫ్ట్ 10 గంటల నుండీ 13కు పెంచడం అదనపు పనిగంటలు వారానికి గరిష్టంగా 48 గంటలకు పరిమితి చేయగా.. ఏడాదికి 150 గంటలకు మించకూడదని పేర్కొంది. వీటిని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి సవరణలు.. పని జీవన సమతుల్యతను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, తమ హక్కులను అణిచివేస్తున్నారంటూ కార్మిక సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇకపోతే చట్ట సవరణలకు వ్యతిరేకంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్మిక సంఘాల పిలుపుమేరకు దేశవ్యాప్తంగా వేలాది మంది నిరసన కారులు వీధుల్లోకి వచ్చారు. దీంతో ఏథెన్స్ లో టాక్సీ, రైలు ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. ఆ ప్రదేశంలో కేవలం బస్సు, టాక్సీలతోనే సర్వీసులు కొనసాగిస్తున్నారు. స్కూల్స్ , ఆసుపత్రులు వంటి ప్రభుత్వ సేవలకు అంతరాయం ఏర్పడింది. నిజానికి పని గంటల పెంపు అటు ఉంచితే.. ఇక్కడ జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదని, కనిష్ట వేతనం నెలకు 880 యూరోలు మాత్రమే అని, దీనికి తోడు ప్రభుత్వం కొంత పెంచినప్పటికీ ఇతర దేశాలతో పోల్చుకుంటే ఈ జీవితం తక్కువేనని.. పైగా పని గంటలు కూడా ఎక్కువగా ఉన్నాయని కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి.

అయితే ప్రభుత్వం మాత్రం అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే 13 గంటల పని షిఫ్ట్ వర్తిస్తుందని చెబుతోంది. మరి కార్మికుల సంఘాలు శాంతించాలంటే ప్రభుత్వం మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియాలి అంటూ అందరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News