గూగుల్ డూడుల్ గా సౌత్ ఇండియా ఐకానిక్ స్టీమ్డ్ బ్రేక్ ఫాస్ట్!
అవును... ప్రముఖ వ్యక్తులకు నివాళిగానో.. ప్రత్యేక సందర్భాలను గుర్తు చేస్తూనో ప్రముఖ సెర్చ్ దిగ్గజం గూగుల్.. రకరాల డూడుల్స్ ను క్రియేట్ చేస్తుంటుందన్న సంగతి తెలిసిందే.;
ఆగస్టు 15, 2025న గూగుల్ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఒక అద్భుతమైన డూడుల్ తో జరుపుకున్న సంగతి తెలిసిందే. సాంప్రదాయ టైల్ ఆర్ట్ వర్క్ ద్వారా భారతదేశం సాధించిన విజయాల వేడుక చేసింది.. భారతీయుల మనసులు మరోసారి గెలుచుకుంది. ఈ సమయంలో ఆన్ లైన్ సెర్చ్ దిగ్గజం మరోసారి భారతీయులను ఆకర్షించింది. ఈ సందర్భంగా ఇడ్లీ వేడుక చేసింది.
అవును... ప్రముఖ వ్యక్తులకు నివాళిగానో.. ప్రత్యేక సందర్భాలను గుర్తు చేస్తూనో ప్రముఖ సెర్చ్ దిగ్గజం గూగుల్.. రకరాల డూడుల్స్ ను క్రియేట్ చేస్తుంటుందన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ రోజు (అక్టోబరు 11) గూగుల్ డూడుల్ మరింత ప్రత్యేకంగా మారింది. ఇందులో భాగంగా... దక్షిణాది వంటకమైన 'ఇడ్లీ' ని ప్రత్యేకంగా రూపొందించింది.
ఈ సౌత్ ఇండియా ఐకానిక్ స్టీమ్డ్ బ్రేక్ ఫాస్ట్ తయారీని ప్రతిబింబించేలా గూగుల్ ఆంగ్ల అక్షరాల్లో చూపించారు. ఇందులో భాగంగా... ఇడ్లీ పిండికి కావాల్సిన పదార్థాలు, దాన్ని నానబెట్టడం, ఆ తర్వాత ఇడ్లీ రేకుల్లో పెట్టి ఉడికించడంతో పాటు పక్క కారం పొడి, సాంబార్, చట్నీతో వడ్డించే విధానాన్ని అందులో చూపించారు. ప్రస్తుతం ఈ డూడుల్ ప్రత్యేకంగా భారతీయులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
కాగా... గూగుల్ డూడుల్ లో ఫుడ్ థీమ్ లో భాగంగా భారతీయ వంటకాలను పెట్టడం ఇదే తొలిసారి కాదు. రెండేళ్ల కిందట పానీపూరీ ప్రపంచ రికార్డుకు గుర్తుగా.. గూగుల్ ప్రత్యేక డూడుల్ రూపొందించగా అది ఎంతో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
ఇక శతాబ్దాల క్రితం దక్షిణ భారతదేశంలో ఉద్భవించిన ఇడ్లీ అల్పాహారాన్ని బియ్యం రవ్వ, మినపప్పు నుండి తయారు చేస్తారు. ఈ వంటకం పోషక విలువలను పెంచడంతో పాటు.. దీన్ని కొబ్బరి చట్నీ, కారంపొడి, వేడి వేడి సాంబార్, ఒక చిటికెడు నెయ్యి వంటి వాటితో అందంగా జత చేసే సున్నితమైన ఘాటైన రుచిని కూడా ఇస్తుంది.
ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉండే ఇడ్లీలు భారతదేశంలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సమాజం విస్తరించిన ప్రతిచోటా ప్రముఖ అల్పాహారంగా ఉంది.