బంగారుబాతు కాదు బంగారు బ్యాక్టీరియా.. దొరికిందో కోటీశ్వరుడే!

ఒకవైపు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. మరొకవైపు చెత్తను తిని 24 క్యారెట్ల ప్యూర్ బంగారాన్ని విసర్జించే అరుదైన బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.;

Update: 2025-08-10 06:38 GMT

ఇప్పటివరకు బంగారు బాతు గురించి అందరికీ తెలుసు. ఈ కథ వినడమే కాదు పుస్తకాలలో చదివాము కూడా.. అయితే ఇప్పుడు బంగారుబాతు కాదు బంగారు బ్యాక్టీరియా అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. ఇది విన్నాక ఈ బంగారు బ్యాక్టీరియా ఏంటి ? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి.. ఇప్పుడు చెప్పే బ్యాక్టీరియా గురించి వింటే నిజంగా ఇలాంటి బ్యాక్టీరియా మనకెందుకు దొరకదు అంటూ తెగ ఆలోచించడం మొదలు పెడతారు.. అంతేకాదు ఆ బాక్టీరియా ఏంటి? అది ఎలా బంగారం పుట్టిస్తుంది? ఎందుకు దానిని బంగారు బాక్టీరియా అంటున్నారు? అనే విషయాలు కూడా తెలుసుకోకమానరు. మరి బంగారు బాతే కాదు ఈ బంగారు బ్యాక్టీరియా జీవితాలు మార్చడంలో ప్రథమ స్థానంలో నిలవబోతోంది అంటూ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. మరి ఏంటీ బంగారు బ్యాక్టీరియా హిస్టరీ ఇప్పుడు చూద్దాం..

ఒకవైపు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. మరొకవైపు చెత్తను తిని 24 క్యారెట్ల ప్యూర్ బంగారాన్ని విసర్జించే అరుదైన బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ బ్యాక్టీరియా పేరు 'కుప్రియోవిడస్ మెటాలీడ్యూరన్స్'. బంగారాన్ని విసర్జిస్తున్న నేపథ్యంలో అటు శాస్త్రవేత్తలు ఈ బ్యాక్టీరియాకి ముద్దుగా 'గోల్డ్ పూపింగ్ బ్యాక్టీరియా' అని పేరు పెట్టారు. చెత్తలో లభించే రాగి, ఇతర లోహాలు కలిసిన బంగారం , నికెల్ వంటి వాటిని తిన్నప్పుడు తన జీర్ణ వ్యవస్థలో విడుదలైన ప్రత్యేక ఎంజైముల సహాయంతో వాటిని ఈ బాక్టీరియా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంలా మార్చి విసర్జిస్తోంది అని వైద్యులు కనుగొన్నారు. ఇక ఈ విషయం తెలిసి అటు ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నా.. మళ్లీ ఆశ్చర్యకర విషయాలు బయటపెట్టారు శాస్త్రవేత్తలు.

విషయంలోకి వెళ్తే.. ఈ బ్యాక్టీరియా కంటికి కనిపించదు. మరి అలాంటి కంటికి కనిపించని ఈ బ్యాక్టీరియా తాలూకు విసర్జితాలు మన కళ్ళకు ఎలా కనిపిస్తాయి? ఇవి కేవలం నానో పార్టికల్స్ పరిమాణంలో ఉంటాయి . ఇక భూతద్దంలో పెట్టి చూస్తే గానీ వీటి జాడ మనం కనుగొనలేము. ముఖ్యంగా ఇది బంగారు గనులు ఉండే చోట, లోహాలతో కలుషితమైన నేలను శుభ్రం చేయడానికి బయోమైనింగ్ పేరుతో ఈ బ్యాక్టీరియాను ఉపయోగించి భూమి కాలుష్యాన్ని తగ్గించాలని అటు శాస్త్రవేత్తలు కూడా భావిస్తున్నారట. మరి కళ్ళకే కనిపించని ఈ బంగారు బ్యాక్టీరియాలను మునుమందు ఎలా అభివృద్ధి చేస్తారో చూడాలి అని అటు ప్రతి ఒక్కరు ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు.

ఇక బంగారం ధరల విషయానికి వస్తే.. 2013 అంటే దాదాపు 12 ఏళ్ల క్రితం 10 గ్రాముల బంగారం ధర సుమారుగా 20 నుండి 30 వేల రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు రూపాయి విలువ తగ్గిపోవడం, అటు వివిధ దేశాల మధ్య పోరు.. బంగారు ధరలకు రెక్కలు వస్తున్నాయి. ప్రస్తుతం అదే 10 గ్రాముల బంగారం విలువ లక్షకు పైమాటే..ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ ఇలాంటి సమయంలో బంగారం కొనుగోలు చేయాలి అంటే సామాన్యులకు అత్యంత భారంగా మారిన విషయము అని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో ఇప్పుడు గోల్డ్ మైనింగ్ అని, గోల్డ్ బ్యాక్టీరియా అని వెలువడుతున్న వార్తలు అటు ప్రజలలో ఆశలు పెంచుతున్నాయి కానీ ఇవి బంగారం ధరలను ఏమాత్రం తగ్గించగలవు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Tags:    

Similar News