అమెరికా, భారత్ లో ఎంతమంది మిలియనీర్స్ ఉన్నారో తెలుసా?

అవును... యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (యూబీఎస్) విడుదల చేసిన గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ - 2025 ప్రకారం.. మొత్తం కుటుంబ నికర విలువ ఆధారంగా ప్రపంచంలోని 50 సంపన్న దేశాల జాబితా వెలువడింది.;

Update: 2025-10-04 18:30 GMT

ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువ మొత్తం కుటుంబ నికర విలువ ఎక్కువగా ఉంటుంది.. ఏ దేశంలో ఎక్కువ మంది మిలియనీర్లు ఉంటారు.. వీటిలో అభివృద్ధి చెందుతోన్న దేశంగా ఉన్న భారతదేశం స్థానం ఎంత..? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తూ తాజాగా యూబీఎస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ - 2025 వెలువడింది. ఈ నివేదికలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అవును... యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (యూబీఎస్) విడుదల చేసిన గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ - 2025 ప్రకారం.. మొత్తం కుటుంబ నికర విలువ ఆధారంగా ప్రపంచంలోని 50 సంపన్న దేశాల జాబితా వెలువడింది. ఇందులో... మొత్తం 163.117 ట్రిలియన్ డాలర్ల సంపదతో యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో ఉంది. ఇది దాని శక్తివంతమైన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తుంది.

ఇదే సమయంలో... పురాతన చరిత్రను వేగవంతమైన సాంకేతిక పురోగతితో కలిపి చైనా 91.082 ట్రిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉండగా... సంప్రదాయం, ఆవిష్కరణలను మిళితం చేస్తూ.. పరిశ్రమ, సాంస్కృతిక వారసత్వం రెండింటి ద్వారా నడిచే సంపదతో 21.332 ట్రిలియన్ డాలర్లతో జపాన్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది.

యూబీఎస్ లో టాప్ 10 సంపన్న దేశాలు!:

యునైటెడ్ స్టేట్స్ - $1,63,117 బిలియన్లు

చైనా – $91,082 బిలియన్లు

జపాన్ - $21,332 బిలియన్లు

యునైటెడ్ కింగ్‌ డమ్ - $18,056 బిలియన్లు

జర్మనీ - $17,695 బిలియన్లు

ఇండియా - $16,008 బిలియన్లు

ఫ్రాన్స్ - $15,508 బిలియన్లు

కెనడా – $11,550 బిలియన్లు

దక్షిణ కొరియా - $11,041 బిలియన్లు

ఇటలీ - $10,600 బిలియన్లు

ప్రపంచంలో అత్యధిక మిలియనీర్లు!:

తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక మిలియనీర్లు అమెరికాలో ఉన్నారు. ఈ మేరకు యూబీఎస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ - 2025 ప్రకారం.. అమెరికాలో ఏకంగా 2.3 కోట్ల మంది మిలియనీర్లు ఉన్నారు. ఆ తర్వాత 63 లక్షల మంది మిలియనీర్లతో చైనా రెండో స్థానంలో కొనసాగుతుండగా... 29 లక్షల మందితో ఫ్రాన్స్ మూడో స్థానంలో నిలిచింది. ఇక 9.17 లక్షల మందితో భారత్ 14వ స్థానంలో నిలిచింది.

అత్యధిక మిలియనీర్లు ఉన్న టాప్ 15 దేశాలివే!:

యునైటెడ్ స్టేట్స్ - 2,38,31,000

చైనా - 63,27,000

ఫ్రాన్స్ - 28,97,000

జపాన్ - 27,32,000

జర్మనీ - 26,75,000

యునైటెడ్ కింగ్ డమ్ - 26,24,000

కెనడా - 20,98,000

ఆస్ట్రేలియా - 19,04,000

ఇటలీ - 13,44,000

సౌత్ కొరియా - 13,01,000

నెథర్లాండ్స్ - 12,67,000

స్పెయిన్ - 12,02,000

స్విట్జర్లాండ్ - 11,19,000

ఇండియా - 9,17,000

తైవాన్ - 7,59,000

Tags:    

Similar News