భూమి పైకి దూసుకొస్తున్న సౌర తుపాను...యమ డేంజర్ ?
ఒక భారీ సౌర తుపాను భూమి పైకి దూసుకొస్తోంది. దీని పరిణామాలు ఏమిటి పర్యవసానాలు ఎలా ఉంటాయన్న దాని మీద చర్చ సాగుతోంది.
ఒక భారీ సౌర తుపాను భూమి పైకి దూసుకొస్తోంది. దీని పరిణామాలు ఏమిటి పర్యవసానాలు ఎలా ఉంటాయన్న దాని మీద చర్చ సాగుతోంది. మరి యమ డేంజరేనా అన్నది కూడా ఆందోళనగా ఉంది. జూన్ 8 అంటే సోమవారం ఒక సౌర తుపాను భూమికి నేరుగా తాకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సూర్యుడు నుంచి వెలువడిన ఒక భారీ సౌర తుఫాన్ ఈ విధంగా భూమి దిశగా రావడం పట్ల సైంటిస్టులు తర్జన భర్జన పడుతున్నారు. ఏమి జరుగుతుంది అన్నది కూడా ఇపుడు ఆసక్తిగా మారింది.
తీవ్రంగానే ఉంటుందా :
ఈ విషయాన్ని అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ అంచనా వేసింది. జీ 3 అంటే తీవ్రమైన జియో మ్యాగ్నెటిక్ స్టార్మ్ తుపాను హెచ్చరికని కూడా జారీ చేసింది. అయితే జూన్ 8న ఇది తీవ్రరూపంగా ఉన్నా జూన్ 9 నాటికి ఆ తీవ్రత కొంత తగ్గి జీ 2 రేంజికి మారుతుందని చెబుతోంది. ఈ సౌర తుపాను ఏ విధంగా ఏర్పడింది అంటే ఈ నెల 6న సూర్యుడి పైన ఉన్న యాక్టివ్ రీజియన్ 4461 నుంచి ఈ సౌర విస్ఫోటనం సంభవించిందని అంటున్నారు. ఆ మీదట ఇది సెకనుకు సుమారు 1400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించి ఒక అంచనాకు వచ్చారు ఇక ఈ సౌర తుపాను భూమి అయస్కాంత క్షేత్రంతో కలిసినప్పుడు జియో మ్యాగ్నెటిక్ తుపానుగా ఏర్పడుతుందని వారు చెబుతున్నారు.
సౌర తుపాను కనిపిస్తుందా :
ఇదిలా ఉంటే ఈ సౌర తుఫాను ఉత్తర భారత దేశం, ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు, అమెరికా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో వాతావరణం అనుకూలిస్తే చూడవచ్చు అని సైంటిస్టులు చెబుతున్నారు. అంతే కాదు సౌర తుపాను ప్రభావం వల్ల ధృవ ప్రాంతాలలో కనిపించే అరోరా కాంతులు తక్కువ అక్షాంశాల వద్ద కూడా కనిపించే చాన్స్ ఉందని అంటున్నారు.
నష్టం ఎంతంటే :
ఇక ఈ సౌర తుపాను జీ 3 స్థాయిలో ఉండడం వల్ల పవర్ గ్రిడ్లలో స్వల్పంగా హెచ్చు తగ్గులు వస్తాయని అంటున్నారు. అలాగే శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థలో చిన్న సమస్యలు వచ్చినా రావచ్చు అని అంటున్నారు. అలాగే హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు కూడా అంతరాయం ఏర్పడాచ్చు అని నిపుణులు అంటున్నారు. భూమి పైకి డైరెక్ట్ గా ఈ సౌర తుపాను దూసుకుని వచ్చినా పెద్దగా నష్టం అయితే ఉండకపోవచ్చు అని మాత్రం అంచనా వేస్తున్నారు. ఎందుకిలా అంటే సొలార సైకిల్ 25లో యాక్టివ్ దశ జరుగుతుంది, అందుకే ఈ రకమైన సందర్భాలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు.