హాట్ టాపిక్... 'అమెరికాలోని భారతీయులందరినీ బహిష్కరించాలి'!

పైగా ప్రపంచం మొత్తం ఓ కుగ్రామంగా మారిపోయినా ఈ రోజుల్లో అనేక దేశాల వారు మరో దేశానికి వెళ్లి ఉద్యోగాలు, వ్యాపారాలు చేయడం.. మరికొంతమంది అక్కడే స్థిరపడిపోవడం జరుగుతుందనే విషయం తెలిసిందే.;

Update: 2025-10-19 13:30 GMT

భారతదేశంలో చాలామందికి అమెరికా ఓ కీలక గమ్యస్థానం అనే చెప్పాలి! ఉన్నత చదువుల కోసమో, ఉజ్వల భవిష్యత్తు కోసమో ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి చాలా మంది అగ్రరాజ్యం వైపు పయనమవుతూ ఉంటారు. ఈ విషయంలో కొంతమంది సక్సెస్ అవుతుంటే.. మరికొంతమంది నిరాశ చెందుతుంటారు. మరోవైపు అమెరికా ఆర్థిక ప్రగతిలో, అభివృద్ధిలో భారతీయుల పాత్రం కీలకం అనే మాటలూ వినిపిస్తుంటాయి.

పైగా ప్రపంచం మొత్తం ఓ కుగ్రామంగా మారిపోయినా ఈ రోజుల్లో అనేక దేశాల వారు మరో దేశానికి వెళ్లి ఉద్యోగాలు, వ్యాపారాలు చేయడం.. మరికొంతమంది అక్కడే స్థిరపడిపోవడం జరుగుతుందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాకు – భారత్ కు ఉన్న సంబంధం ప్రత్యేకం అనే చెప్పాలి. ఈ సమయలో అమెరికాలో ఉన్న భారతీయులపై ఓ రాజకీయ నాయకుడు విధ్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.

అవును... అమెరికాలో ఉన్న భారతీయులందరినీ వెంటనే బహిష్కరించాలని కోరుతూ ఆ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు చాండ్లర్ లాంగేవిన్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇలా యూఎస్‌ లో ఉన్న ప్రతి భారతీయుడిని తక్షణమే బహిష్కరించాలంటూ ఆయన పెట్టిన పోస్టులుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో పామ్‌ బే నగర కౌన్సిల్‌ ఆయనపై చర్యలు తీసుకుంది. అసలేం జరిగిందనేది ఇప్పుడు చూద్దామ్... !

వివరాళ్లోకి వెళ్తే... ఓ భారతీయ ట్రక్‌ డ్రైవర్‌ చేసిన ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందనే విషయాన్ని ప్రస్థావిస్తూ... 'అమెరికాలోని భారతీయులందరినీ వెంటనే బహిష్కరించాలి’ అని ఫ్లోరిడాలోని పామ్‌ బే సిటీ కౌన్సిల్‌ కు చెందిన యూఎస్‌ కన్జర్వేటివ్‌ నాయకుడు చాండ్లర్‌ లాంగేవిన్‌ రాసుకొచ్చారు. ఇదే సమయంలో... అమెరికా గురించి పట్టించుకునేందుకు ఒక్క భారతీయుడు కూడా లేరని అన్నారు.

ఇదే క్రమంలో... భారతీయులు మనల్ని ఆర్థికంగా దోపిడి చేస్తున్నారని.. భారత్‌ ను, ఆ దేశ ప్రజలను ప్రోత్సహించేందుకే వారు ఇక్కడ ఉన్నారని.. అమెరికన్ల కోసం మాత్రమే ఈ దేశం అని ఆయన మరో పోస్టులో వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగని ఆయన... ఈ రోజు తన పుట్టినరోజని.. ప్రతి భారతీయుడి వీసాను రద్దు చేసి వారిని ఇక్కడి నుంచి బహిష్కరించాలని.. ఇదే తన కోరిక అంటూ ఓ పోస్ట్ పెట్టి, దానికి ట్రంప్‌ ను ట్యాగ్‌ చేశారు.

ఈ వ్యాఖ్యలను పామ్‌ బే మేయర్‌ మదీనా తీవ్రంగా తప్పుబట్టారు. ఇతరులను కించపరిచేలా, విలువలు తగ్గించేలా మన మాటలు ఉండకూడదని, అలాంటి వారికి ఇక్కడ చోటులేదని ఘాటుగా బదులిచ్చారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో నగర కౌన్సిల్‌ కు ఫిర్యాదులు అందాయి. దీంతో కౌన్సిల్ లాంగేవిన్‌ పై చర్యలు తీసుకుంది. ఇక నుంచి ఆయన ఏదైనా అజెండాను ప్రవేశపెట్టాలనుకుంటే ముందే ఏకాభిప్రాయం పొందాల్సి ఉంటుందని సూచించింది.

ఇలా అతని నోరు మూయించడం కూడా చర్చనీయాంశంగా మారిన వేళ... ఈ చర్యలను లాంగేవిన్ తీవ్రంగా ఖండిచడంతో పాటు, కౌన్సిల్ తీర్మానం తన వాక్ స్వేచ్ఛ హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.

Tags:    

Similar News