ధన్యవాదాలు అంటున్న ధర్మేంధ్ర

దీని భావమేమిటి పరమేశ్వరా అని బుర్రలు బద్ధలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయాల గురించి ఆ మాత్రం అర్ధం అయితే చాలు జరగబోయేది ఇట్టే బోధపడుతుంది.

Update: 2026-06-25 00:30 GMT

సినిమా చివరిలో శుభం కార్డు పడుతుంది. దానికి అయిదు నిముషాల ముందు వచ్చే సీన్లలో కధ కంచికి అని తెలిసిపోతుంది. ఆడియన్స్ నెమ్మదిగా సీట్లలో నుంచి లేవడానికి చూస్తారు. రాజకీయాల్లో కూడా అటు ఇటూగా అంతే అనుకోవాలి. అందరికీ థాంక్స్ అని ఒక కీలక నేత నుంచి మాట వస్తే అది కూడా అనూహ్యంగా వస్తే జరగబోయేది ఏమిటో ఇట్టే ఊహించుకోవచ్చు. ఇపుడు ఒక కీలక కేంద్ర మంత్రి గత నెలన్నర రోజులుగా దేశవ్యాప్తంగా మారు మోగుతున్న పేరున్న మంత్రి గారు అందరికీ థాంక్స్ అని వినయంగా చెబుతున్నారు. దీని భావమేమిటి పరమేశ్వరా అని బుర్రలు బద్ధలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయాల గురించి ఆ మాత్రం అర్ధం అయితే చాలు జరగబోయేది ఇట్టే బోధపడుతుంది.

అవును పొరపాటే మరి :

ఇంతకీ ఆ మంత్రి గారు ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్. రాజకీయ ప్రత్యర్ధులు అంతా అధర్మేంద్ర అని సెటైర్లు పేల్చినా కాక్రోచ్ పార్టీ తరఫున ఆయన రాజీనామా కోరుతూ భారీ ప్రదర్శనలు సాగినా ఏనాడూ ఇంత కూల్ గా ధర్మేంద్ర ధన్యవాదాలు చెప్పలేదు. ఇపుడు మాత్రం ఇక సెలవా మరి అన్నట్లుగా అందరికీ కృతజ్ఞతలు అంటున్నారు. పైగా ఎట్టకేలకు ఆయన తన పొరపాట్లను కూడా అంగీకరించారు. నెల రోజులకు పైగా కాక్రోచ్ పార్టీ తరఫున యూత్ అలాగే విపక్షాలు గొంతు చించుకుంటున్న నీట్ పరీక్షా పత్రం లీకేజ్ మీద కిమ్మనకుండా వ్యవహరించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి గారు ఇపుడు తాపీగా తప్పు ఒప్పుకుంటున్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో పొరపాట్లు జరిగాయనై కేంద్ర మంత్రి అంగీకరించడమే అతి పెద్ద విశేషం.

కఠిన చర్యలు అంటూ :

అంతే కాదు కేంద్ర మంత్రి మరో మాట చెప్పారు. నీట్ పరీక్ష మళ్లీ రీ ఎగ్జామ్ పెట్టి సమర్ధంగా నిర్వహించామని. తప్పులను సరిదిద్దుకున్నామని కూడా ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృత్తం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఇక పేపర్ లీక్ మాఫియా మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఇక రీ టెస్ట్ నిర్వహణకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.

అర్ధమైనట్లేనా :

ధర్మేంద్ర ప్రధాని కేంద్ర కేబినెట్ మీటింగ్ తరువాత ఈ మాటలు అన్నారు అంటే విషయం అర్ధమైనట్లేనా అన్న చర్చ ముందుకు వస్తోంది. ఆయన శాఖను మారుస్తారా లేక ఏకంగా కేంద్ర మంత్రి పదవికే దూరం పెడతారా అన్నది కూడా ఢిల్లీ స్థాయిలో హాట్ టాపిక్ గా ఉంది. ఆయనను కేంద్ర మంత్రి పదవి నుంచి దూరం పెడుతారు అన్నదే ఎక్కువ మంది నమ్ముతున్న విషయం. ఎందుకంటే జెన్ జీ తరం అంతా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంటూ డిమాండ్ చేసింది. మోడీ ప్రభుత్వం ఎక్కువగా ఇబ్బంది పడింది నీట్ పరీక్ష పత్రం లీక్ తోనే. కాక్రోచ్ లు పుట్టుకొచ్చి బలమైన కేంద్ర ప్రభుత్వం మీద ద్వజమెత్తాయి. ఇలా ఎవరూ అసలు ఊహించలేదు. అందువల్ల కేంద్ర మంత్రివర్గంలో కొత్త శాఖతో అయినా ధర్మేంద్ర కనిపించినా జెన్ జీ రియాక్షన్ ఏంటన్నది వెంటాడుతూనే ఉంటుంది అని అంటున్నారు. సో ఆయన కేంద్ర మాజీ మంత్రి కాబోతున్నారా ఎపుడు అది జరుగుతుంది అంటే జస్ట్ వెయిట్ అండ్ సీ. వెరీ సూన్ అని ఢిల్లీ న్యూస్ చెబుతోంది. మరి ఇది నిజమా లేక ఊహాగానా లేక పుకార్ నా అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.

Tags:    

Similar News