బంబుల్ లో డేటింగ్.. ఓయోలో మీటింగ్.. నెక్స్ట్ డే బిగ్ ట్విస్ట్!
ఇటీవల కాలంలో డేటింగ్ యాప్ ల సంస్కృతి విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.;
ఇటీవల కాలంలో డేటింగ్ యాప్ ల సంస్కృతి విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. వీటి వల్ల ఎన్నో సంసారాలు కూలిపోతున్నాయని అంటున్నారు.. మరికొంతమంది జీవిత భాగస్వామిని ప్లానింగ్ తో మోసం చేస్తున్నారని.. ఫలితంగా చెడు సంస్కృతి వేగంగా విస్తరిస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఇష్యూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ డేటింగ్ యాప్ లలోని పరిచయాలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయనేది తెరపైకి వచ్చింది.
అవును... ఒక మహిళ, ఓ పురుషుడు మొదట్లో 'బంబుల్' అనే డేటింగ్ అప్లికేషన్ ద్వారా పరిచయం ఏర్పరుచుకున్నారు. తరువాత ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు పంపుకోవడాలు, చాటింగ్ లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో దాదాపు ఒక సంవత్సరం పాటు వారి పరిచయాన్ని పెంచుకున్నారు. ఓ రోజు వారు వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారు ఓయో ఫ్లాగ్ షిప్ హోటల్ కు వెళ్లారు.. అక్కడ వారి మధ్య శారీరక సాన్నిహిత్యం ఏర్పడిందని చెబుతున్నారు.
ఈ క్రమంలో.. మరుసటి రోజు ఆ వ్యక్తి ఆమెను తన అపార్ట్ మెంట్ లో తిరిగి దింపాడు. ఆ తర్వాత బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇందులో భాగంగా... ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి అదే రోజు ఫిర్యాదు చేసింది.. తనపై అత్యాచారం జరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.. దర్యాప్తు తర్వాత అతనిపై తుది నివేదికను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇందులో భాగంగా... నిందితుడు, ఫిర్యాదుదారుడి మధ్య జరిగిన చాట్ లు నిందితుడు.. ఫిర్యాదుదారుడి మధ్య జరిగిన చర్యలన్నీ ఏకాభిప్రాయంతో జరిగాయని సూచిస్తున్నాయని కోర్టు పేర్కొంది. ఏకాభిప్రాయ సాన్నిహిత్యం, తీవ్రమైన అత్యాచార ఆరోపణ మధ్య సూక్ష్మమైన వ్యత్యాసాన్ని స్పష్టంగా పేర్కొంది. పరస్పర సంకల్పం నుండి పుట్టిన సంబంధం, అది నిరాశలో స్థాపించబడినప్పటికీ, స్పష్టమైన కేసుల్లో తప్ప, క్రిమినల్ చట్టం ప్రకారం నేరంగా మారదని తెలిపింది!
ఈ సందర్భంగా నిందితుడిపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్ ను తత్ఫలితంగా జరిగిన చర్యలను రద్దు చేసింది. ఈ సందర్భంగా... ఈ కేసు స్వభావం ప్రస్తుత తరం యువతకు ఒక తీవ్రమైన హెచ్చరిక లాంటిదని అంటున్నారు. వేగవంతమైన డేటింగ్ సంస్కృతి పరిణామాల గురించి వారంతా చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఇవి కొన్ని సందర్భాల్లో తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేలా చేస్తుందని అంటున్నారు.