బీజేపీ 2/3వ వంతు మెజారిటీకి కాంగ్రెస్ మోకాలడ్డు !
దేశంలో ఏ అంశం మీద అయినా రాజ్యాంగ సవరణ జరగాలి అంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం పడుతుంది.
దేశంలో ఏ అంశం మీద అయినా రాజ్యాంగ సవరణ జరగాలి అంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం పడుతుంది. బీజేపీకి చాలా రాజ్యాంగ సవరణ ప్రతిపాదిత బిల్లులు ఉన్నాయి. బీజేపీ అజెండాలో అమ్ముల పొదిలో అనేక పెండింగు బిల్లులు కూడా ఉన్నాయి. దాంతో ఈ అరుదైన మ్యాజిక్ ఫిగర్ ని సాధించడం మీద బీజేపీ పెద్దలు ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. బీజేపీ ఒక్కసారి కనుక లోక్ సభలో మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించింది అంటే కనుక ఇక కమలానికి ఎదురులేని పరిస్థితి వస్తుంది. దాంతో తనకు కావాల్సిన బిల్లులను రాజ్యంగ సవరణలు చేయగలదు, దాని వల్ల దేశ రాజకీయ స్వరూప స్వభావాలలో కూడా కీలకమైన మౌలికమైన మార్పులు వస్తాయి. విపక్షాలకు కూడా ఇది అతి పెద్ద సవాల్ గా మారుతుంది. అందుకే దేశంలో విపక్షంలో పెద్ద పార్టీ ఇండియా కూటమిని నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ బీజేపీ 2/3వ వంతు మెజారిటీని అడ్డుకుని తీరుతామని స్పష్టంగా చెబుతోంది.
కాంగ్రెస్ సీరియస్ గానే :
బీజేపీ తన ప్రయత్నాలలో తాను ఉంటే కాంగ్రెస్ బీజేపీకి ఈ రేర్ మ్యాజిక్ ఫిగర్ దక్కకుండా ఎత్తులు పై ఎత్తులు వేస్తోంది. తాజాగా పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ వ్యూహాత్మక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించేందుకు పడుతున్న శ్రమను చేస్తున్న ప్రయత్నాలను గట్టిగా విమర్శించింది. పూర్తి అప్రజాస్వామిక పద్ధతులలో బీజేపీ ఈ విధంగా చేస్తోంది అని కాంగ్రెస్ మండిపడింది. దీనిని తాము అడ్డుకుని తీరుతామని అంటోంది. బీజేపీకి పార్లమెంట్ లో రెండు వంతుల మెజారిటీ దక్కడం చాలా కష్టమని కూడా కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తాము విపక్షాలను కూడగడతామని బీజేపీకి ఆ బిగ్ నంబర్ లేకుండా చేస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు.
డీఎంకే కీలకంగా :
ఈ నేపథ్యంలో డీఎంకే కీలకంగా మారుతోంది. డీఎంకేకి 22 మంది ఎంపీలు లోక్ సభలో ఉన్నారు. తమిళనాడు ఎన్నికల తరువాత కాంగ్రెస్ అనుసరించిన విధానాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి నుంచి డీఎంకే దూరం జరిగింది. పైగా ఎన్ డీయేకు చేరువ అవుతోంది అని కూడా ప్రచారం సాగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ వ్యూహాత్మక సమావేశంలో డీఎంకేని కూడా దగ్గరకు తీయాలని తీర్మానించారు అని అంటున్నారు. డీఎంకే ఇండియా కూటమి వైపు ఉంటే కనుక బీజేపీ బిల్లులు ఏవీ మూడింట రెండు వంతుల సంఖ్యాబలాన్ని సాధించలేవని కాంగ్రెస్ వ్యూహకర్తలు బలంగా నమ్ముతున్నారు. అంతే కాదు ఆప్ ని కూడా తమతో కలుపుకుని పార్లమెంట్ లో ఉమ్మడిగానే ఎన్డీయే మీద పోరాడాలని కాంగ్రెస్ తీర్మానించింది.
బీజేపీ లెక్కలు ఇవేనా :
ఇక చూస్తే బీజేపీ అన్ని విధాలుగా తన లెక్కలను సరిచూసుకుంటోంది. డీఎంకేని ఎలాగైనా తమ వైపు లాగాలని భావిస్తోంది. ఆ మీదట అన్ని న్యూట్రల్ పార్టీల మద్దతు తీసుకుంటే కనుక సులువుగా 362 నంబర్ కి చేరువ కావచ్చు అని భావిస్తోంది. సభ్లఓ 543 మంది సభ్యులు హాజరైతేనే 362 మంది మెంబర్స్ కచ్చితం అవుతారు. అందులో కొందరు సభ్యులు సభకు గైర్ హాజరు అయితే ఈ మ్యాజిక్ ఫిగర్ ఇంకా తగ్గిపోతుంది. అలా కూడా బీజేపీ పెద్దల వ్యూహాలు సాగుతున్నాయని అంటున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసేందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని దక్కనీయకుండా చేస్తామని దాదాపుగా శపధం పడుతోంది. దాంతో ఈసారి పార్లమెంట్ సమావేశాలు వెరీ ఇంట్రెస్ట్ అన్నట్లుగానే ఉండబోతున్నాయి.