ఉభయచర దాడి నౌక... చైనా 'సిచువాన్' గురించి తెలుసా?
నీరూ నాదే, నేలా నాదే అనే చైనా యుద్ధ నౌక సుచివాన్ ట్రయల్ కోసం రంగంలోకి దిగింది.;
నీరూ నాదే, నేలా నాదే అనే చైనా యుద్ధ నౌక సుచివాన్ ట్రయల్ కోసం రంగంలోకి దిగింది. ప్రపంచంలోనే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టం (ఈ.ఎం.ఏ.ఎల్.ఎస్) వ్యవస్థ కలిగి ఉన్న తొలి యుద్ధ నౌక అయిన సిచువాన్ లో.. యుద్ధ విమానాలు, హెలికాప్టర్ లు, డ్రోన్ లు, సముద్రం నుంచి భూమిపైకి నేరుగా వెళ్లిపోయే వాహనాలను, పెద్ద సంఖ్యలో సైనికులను ఒక చోటు నుంచి మరో చోటుకు చేరవేయవచ్చు.
అవును... నావికా దళంలో అమెరికాతో పోటీ పడేందుకు తన ఆయుధ సంపత్తిని విస్తరిస్తోన్న చైనా... అందులోభాగంగా అత్యంత సామర్థ్యం కలిగిన 'ఫుజియాన్' (టైప్-003) యుద్ధ నౌకను ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ విమాన వాహన నౌకను చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఇటీవల ప్రారంభించారు. ఈ క్రమంలో తాజాగా సిచువాన్ వ్యవహారం తెరపైకి వచ్చింది.
వాస్తవానికి టైప్-075 యుద్ధనౌక కంటే అప్ గ్రేడ్ వెర్షన్ అయిన సిచువాన్.. 076 వెర్షన్ తో చేయబడింది. టైప్-075.. 40,000 టన్నుల డిస్ ప్లేస్ మెంట్, 237 మీటర్ల పొడవు, 36 మీటర్ల బీమ్ లేదా వెడల్పుతో కూడిన ఫ్లైట్ డెక్ కలిగి ఉండగా... టైప్-076 సిచువాన్.. 50,000 టన్నుల డిస్ ప్లేస్ మెంట్ తో 260 మీటర్ల పొడవు, 52 మీటర్ల ఫ్లైట్ డెక్ ను కలిగి ఉంది!
టైప్-075 కంటే ఎక్కువగా విస్తరించిన దీనీ ఫ్లైట్ డెక్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఉభయచర దాడి నౌకలలో ఒకటిగా దీనిని నిలబెడుతోంది. ఇది యూఎస్ "అమెరికా-క్లాస్", జపాన్ "ఇజుమో క్లాస్" హెలికాప్టర్ క్యారియర్ల కంటే పెద్దది. చైనా మూడవ విమాన వాహక నౌక ఫుజియాన్ మాదిరిగానే సుచివాన్ కూడా దానిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టం ఉంది.
ఈ క్రమంలో... శుక్రవారం చైనా టైప్-076 ఉభయచర దాడి నౌక సిచువాన్.. షాఘంలోని హుడాంగ్-జోగ్వా షిప్ యార్డ్ ఓడ రేవు నుంచి బయలుదేరి.. దాని తొలి సముద్ర పరీక్ష కోసం సంబంధిత సముద్ర ప్రాంతం వైపు ప్రయాణించిందని చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీ.ఎల్.ఏ) తన అధికారిక వియ్ చాట్ అకౌంట్ లో ప్రకటించింది.
ఈ సందర్భంగా స్పందించిన చైనా సైనిక వ్యవహారాల నిపుణుడు వాంగ్ యున్ఫీ... టైప్ 076 సిచువాన్ మొదటి పరీక్ష, దాని నిర్మాణం చాలా బాగా జరుగుతోందని అన్నారు! దాని ముదటి టైప్ 075 ఉభయచర దాడి నౌకతో పోలిస్తే దీనిలో కొత్త డ్యూయల్-ఐలాండ్ డిజైన్ లో కొత్త విమానయాన నియంత్రణ వ్యవస్థ, కొత్త సాంకేతికతలతో జోడించబడిందని అన్నారు.