వస్తువులే కాదు విరిగిన ఎముకలు కూడా అతికించవచ్చు.. ఎలాగంటే?

ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు లేదా కొన్ని సందర్భాలలో అనుకోకుండా ఎముకలు విరుగుతూ ఉంటాయి.;

Update: 2025-09-13 16:30 GMT

ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు లేదా కొన్ని సందర్భాలలో అనుకోకుండా ఎముకలు విరుగుతూ ఉంటాయి. అయితే ఇలా ఎముకలు విరిగితే వైద్యుడి చికిత్స తప్పనిసరి.. నిజానికి కొన్ని ఊర్లలో నాటు వైద్యం చేసి.. విరిగిన ఎముకలను అతికించే ప్రయత్నం చేస్తారు. మరికొన్ని ప్రదేశాలలో శస్త్ర చికిత్సలు తప్పనిసరి. అయితే అటు వైద్యులైనా.. ఇటు నాటు వైద్యమైనా విరిగిన ఎముక అతుక్కోవాలి అంటే చాలా సమయం పడుతుంది.

అయితే ఇకపై గంటల తరబడి ఆపరేషన్ థియేటర్లో ఇబ్బందులు ఎదుర్కోకుండా.. చికిత్స అనంతరం నెలల పాటు ఇబ్బందులు పడకుండా.. కేవలం మూడు నిమిషాలలోనే విరిగిన ఎముకను అతికించవచ్చట. అది కూడా ఒక సూది ద్వారా.. విరిగిన ఎముకలను క్షణాలలో అతికించే ఒక పద్ధతిని శాస్త్రవేత్తలు కనుక్కున్నట్లు సమాచారం.. అది కూడా చైనా పరిశోధకులు కనుక్కున్నట్లు తెలుస్తోంది. సముద్రాల అడుగు భాగంలో ఉండే ఆల్ చిప్పలను స్ఫూర్తిగా తీసుకొని.. ఈ పరిశోధనకు బీజం వేయగా అది విజయవంతం అయ్యింది.

తూర్పు చైనా ప్రాంతంలో షెజాంగ్ ఫ్రావిన్స్ లో బోన్ 02 అనే ఒక 'గ్లూ'ను పరిశోధకులు కొనుక్కున్నారు. దీంతో విరిగిన ఎముకలను కేవలం మూడు నిమిషాలలోనే అతికించవచ్చు. ఇందుకు సంబంధించి దీని పనితీరుపైన అసోసియేట్ చీఫ్ ఆర్థో ఫెడిక్ , లిన్ షాన్ఫింగ్ షెజాంగ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. "కొత్తగా అభివృద్ధి చేసిన ఈ జిగురు వంటి పదార్థం కేవలం రెండు మూడు నిమిషాలలోనే ఎముకలను బాగుపరిచేలా చేస్తుందంటూ తెలియజేశారు. ఈ జిగురు రక్త ప్రవాహం అధికంగా ఉండే వాతావరణంలో కూడా దీని పనితీరు చాలా మెరుగ్గా ఉంటుందంటూ తెలియజేశారు. సాధారణంగా ఎముకలు విరిగాయి అంటే వాటిని అతికించాలంటే శరీరానికి పెద్ద కోతలు వేసి స్టీల్ ప్లేట్లను అమరుస్తూ ఉంటాము.. కానీ నూతనంగా అభివృద్ధి చేసిన ఈ ఇంజక్షన్ మాత్రం అలాంటివి అవసరం లేకుండా చేస్తుంది" అంటూ వెల్లడించారు.

బోన్ 02 ని ల్యాబొరేటరీ లో కూడా పరీక్షించారు.. అక్కడ కూడా ఇది చాలా సురక్షితంగా సమర్థవంతంగా పనిచేసినట్లు నిపుణులు తెలుపుతున్నారు. దాదాపుగా 400 పౌండ్లు బాండింగ్ ఫోర్సును నమోదు చేసిందట..0.5 ఎంపిఏ కోత ఏర్పడిన, 10mpp బలం ప్రదర్శించాలి. ఈ లక్షణాలన్నీ కూడా సంప్రదాయ మెటల్ ఇంప్లిమెంట్ ని సైతం భర్తీ చేయగలిగిన సామర్థ్యంతో ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ఇంజక్షన్ ద్వారా బాడీ రియాక్షన్లు, ఇన్ఫెక్షన్ వంటివి కూడా తగ్గుముఖం పడతాయి. ఎముక గాయం మానగానే శరీరంలో కలిసిపోతుంది. ఇందులో ఇదో విశిష్టమైన లక్షణంఉంది అని తెలుపుతున్నారు. 2016లో లిన్ ప్రెసిడెంట్ అనే వైద్యుడు విరిగిన ఎముకలకు వైద్యం చేస్తూ ఉండేవారు అలా గంటలకొద్ది శాస్త్ర చికిత్స గదులలో ఉండి వైద్యం అందించేవారు.. అయినా కూడా ఆపరేషన్లు సక్సెస్ అనేవి చాలా తక్కువగా ఉండడంతో ఆయన నుంచి ఆలోచింపజేసిందే ఈ పరిశోధన. ఈ క్రమంలో నీటి అడుగున వంతెనలకు గట్టిగా అతుక్కుని ఉండేటువంటి ఆల్చిప్పలను ప్రేరణగా తీసుకొని వాటి స్ఫూర్తితోనే బోన్ గ్లూ ని అభివృద్ధి చేశారట. ఏది ఏమైనా విరిగిన వస్తువులే కాదు ఇప్పుడు విరిగిన ఎముకలను కూడా గమ్ సహాయంతో అతికించవచ్చు అని తెలియడంతో అందరూ ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News