బీహార్ ఎన్నికల వేళ బాబు స్ట్రాంగ్ సిగ్నల్స్ !
నరేంద్ర మోడీ 2029 దాకా మరో నాలుగేళ్ల పాటు దేశానికి ప్రధానిగా విశేష సేవలు అందిస్తారని బాబు చెప్పారు. ఈ విధంగా ఆయన చెప్పడం ద్వారా దేశంలోని ఇండియా కూటమిని ఒక స్ట్రాంగ్ మేసేజ్ ని పంపించారు అనుకోవాలి.;
ప్రధాని నరేంద్ర మోడీని మరోసారి ఆకాశానికి ఎత్తేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆయన మూడు రోజుల పాటు అరబ్ దేశాల పర్యటనను ముగించుకుని వచ్చిన నేపధ్యంలో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాతీయ స్థాయి రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాల గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నరేంద్ర మోడీ గురించి కూడా చాలా విషయాలు ప్రస్తావించారు. దేశానికి నరేంద్ర మోడీ నాయకత్వం చాలా అవసరం అన్నారు.
కరెక్ట్ టైం లో లీడర్ :
ఈ దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు మోడీ అన్నారు. నరేంద్ర మోడీది అత్యంత శక్తివంతమైన నాయకత్వం అన్నారు. నరేంద్ర మోడీదే ఈ దశాబ్దం అని కొనియాడారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రగతి శీల ప్రభుత్వమని కొనియాడారు. ప్రపంచంలో భారత్ ని నిలబెట్టడానికి మోడీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. దేశంలో సంస్కరణలు అన్నీ మోడీ హయాంలో పెద్ద ఎత్తున సాగుతున్నాయని అన్నారు. ప్రజల సాధికారత అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వం ఎన్డీయేది అన్నారు.
అప్పటి వరకూ ఆయనే :
నరేంద్ర మోడీ 2029 దాకా మరో నాలుగేళ్ల పాటు దేశానికి ప్రధానిగా విశేష సేవలు అందిస్తారని బాబు చెప్పారు. ఈ విధంగా ఆయన చెప్పడం ద్వారా దేశంలోని ఇండియా కూటమిని ఒక స్ట్రాంగ్ మేసేజ్ ని పంపించారు అనుకోవాలి. బీహార్ ఎన్నికలతో ముడిపెడుతూ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని ఇండియా కూటమి నేతలు అంటూ వస్తున్నారు. అయితే అలా ఏమీ జరిగేది లేదని బాబు తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. ఒక రాష్ట్రంలో ఎన్నికల వల్ల కేంద్రంలో ప్రభుత్వాల భవిష్యత్తు తేలేది కాదు, కానీ ఎన్డీయేకి టీడీపీ జేడీయూ రెండూ మద్దతుగా ఉన్నాయి. అయితే టీడీపీకే ఎక్కువ మంది ఎంపీల మద్దతు ఉంది. దాంతో పాటు బాబు మద్దతు విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తాజా ఇంటర్వ్యూలో ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లు అయింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే బీహార్ లో కూడా ఎన్డీయే ఘన విజయం సాధిస్తుంది అని బాబు చెప్పడం విశేషం.
దశాబ్దం మోడీదే :
దేశ ప్రధానిగా మోడీ గత 11 ఏళ్ళుగా ఈ దేశాన్ని పాలిస్తున్నారు. రానున్న దశాబ్దం కూడా కచ్చితంగా మోడీదే అవుతుందని చంద్రబాబు చెబుతున్నారు. మోడీ నాయకత్వంలో దేశం ముందుకు సాగడమే కాదు భారతీయులు కూడా ప్రగతిపధంలో సాగుతున్నారని అన్నారు దాంతో ఇండియా కూటమి మోడీ సర్కార్ మధ్యలో దిగిపోతుంది అని ఏమైనా ఆశలు కానీ భ్రమలు కానీ పెట్టుకుంటే కనుక అవి ఒట్టివే అన్నట్లుగానే బాబు వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు.
ఏపీలో అభివృద్ధి :
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ తో విశేషమైన అభివృద్ధి గడచిన పదహారు నెలల కాలంలో జరుగుతోంది అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి కేంద్ర సహకారం ఉంటే కచ్చితంగా ప్రగతి దారులు కనిపిస్తాయని బాబు అన్నారు. ఇపుడు అదే జరుగుతోంది అని ఆయన చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణం కానీ అలాగే వ్యవసాయంలో ప్రగతి కానీ టెక్నాలజీని అందిపుచ్చుకోవడం కానీ కొత్త పరిశ్రమలు పెట్టుబడులు ఏపీకి రావడం కానీ ఇవన్నీ తమ ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున సాగుతున్నాయని చంద్రబాబు చెప్పారు.