ఎస్... వైసీపీ కోరుకున్నట్టు బాబు చేయరు.. !
అవును!.. ఈ మాట టీడీపీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. 'వైసీపీ కోరుకుంటున్నట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబు చేయరండి.;
అవును!.. ఈ మాట టీడీపీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. 'వైసీపీ కోరుకుంటున్నట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబు చేయరండి. వాళ్లలా మా నాయకుడు దుందుడుకు నిర్ణయాలు తీసుకోరు. ప్రజలతో ఛీ కొట్టించుకోరు.' అని టీడీపీకి చెందిన రాష్ట్రస్థాయి సీనియర్ నాయకుడు ఒకరు మీడియా ముందు వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఆయన రెండు మూడు విషయాలను కూడా ప్రస్తావించారు. ఆ విషయాలపై చంద్రబాబు చాలా ఆచి తూచి వ్యవహరిస్తారని కూడా చెప్పారు.
పార్టీలో కీచులాడుకుంటున్న నాయకుల విషయాన్ని గమనిస్తే.. తరచుగా గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇటీవల కాలంలో మీడియా ముందుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారిపై వేటు వేయాలని.. కొందరు సొంత పార్టీ నాయకులే కోరుతున్నారు. ఇక, ప్రతిపక్షం వైసీపీ నేతలు.. టీడీపీ చెలరేగే ఇలాంటి మంటలతో చలి కాచుకునేందుకు ఎదురు చూస్తోంది. కానీ, చంద్రబాబు ఆ అవకాశం ఇవ్వడం లేదు. అన్నీ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.
'వేటు వేస్తే.. ఒక్క క్షణం.. కానీ, అవకాశం ఇస్తే.. వారు మారే చాన్స్ ఉంటుంది' అని చంద్రబాబు చెబుతు న్నారు. అందుకే.. ఎంతో సీరియస్ అయిన విషయాల్లోనూ నాయకుల ఆలోచనకు వదిలి పెడుతున్నారు. పైకి ఇది.. చంద్రబాబు ఏమీ తేల్చడం లేదన్న వాదన వినిపించేలా చేస్తున్నా.. ఆయన చాలా వ్యూహాత్మ కంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ నాయకులు మారకపోతే.. ప్రజలే వారిని పక్కన పెట్టేలా.. బాబు అనుసరిస్తున్న తీరును సీనియర్లు చెబుతున్నారు.
ఇక, ప్రకృతి విపత్తులు.. సంభవించినప్పుడు.. వైసీపీ అధినేత మాదిరిగా.. ఇంట్లో కూర్చుని చంద్రబాబు సలహాలు సూచనలకు పరిమితం కావడం లేదు. నేరుగా బరిలోకి దిగుతున్నారు. గతంలో వైసీపీ అధినేత సీఎంగా ఉన్పప్పుడు.. తాడేపల్లిలో కూర్చుని సలహాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా అలానే చేయాలని కోరుతున్నారు. కానీ.. బాబు అలా చేయడం లేదు. చేయరు కూడా. అలాగే.. పెట్టుబడుల విషయంలోనూ వారు మనదగ్గరకు రావాలి` అనే ధోరణి వైసీపీ అనుసరిస్తే.. పెట్టుబడి పెట్టే వారి కోసం.. చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. సో.. ఇలాంటి కీలక విషయాల్లో వైసీపీ ఆశించినట్టు చంద్రబాబు చేయరని సీనియర్లు చెబుతున్నారు.