సీబీఐ నుంచి జగన్ కి మూడు సార్లు ఫోన్లు...ఆ తరువాత ?

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కి సీబీఐ నుంచి ఇటీవల కాలంలో ఫోన్లు వెళ్ళాయా అంటే వెళ్ళాయని సీబీఐ వర్గాలు అంటున్నాయి.;

Update: 2025-10-23 03:26 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కి సీబీఐ నుంచి ఇటీవల కాలంలో ఫోన్లు వెళ్ళాయా అంటే వెళ్ళాయని సీబీఐ వర్గాలు అంటున్నాయి. ఒకసారి కాదు, మూడు సార్లు జగన్ కి ఫోన్ చేశామని సీబీఐ కోర్టులో సీబీఐ తరఫున లాయర్లు వాదించారు. అయినా సరే జగన్ ఆ ఫోన్ నుంచి రెస్పాండ్ కాలేదని వారు పేర్కొన్నారు. జగన్ ఇచ్చిన నంబర్ సరైనదా కాదా అని కూడా వారు కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు.

ఉద్దేశ్యపూర్వకంగానే :

జగన్ ఉద్దేశ్యపూర్వకంగానే పనిచేయని నంబర్ ఇచ్చారని సీబీఐ తరఫున న్యాయవాదులు వాదించారు. జగన్ ఈ మధ్య లండన్ పర్యటన చేపట్టారు. ఆయనకు సీబీఐ కోర్టు అనుమతించింది. అయితే ఆయన ఫోన్ నంబర్ ని సీబీఐ అధికారులకు ఇవ్వాలని కోరింది. అయితే జగన్ లండన్ పర్యటనలో ఉన్నపుడు సీబీఐ అధికారులు మూడు సార్లు ఆ నంబర్ కి ఫోన్ చేసారు అని కోర్టుకు తెలియచేశారు కానీ సరైన స్పందన లేకపోయింది అని ఆరోపించారు.

అనుమతించవద్దు :

జగన్ విదేశీ పర్యటనలను అనుమతించవద్దు అని సీబీఐ తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలియచేశారు. దానికి కారణంగా ఆయన ఫోన్ నంబర్ లిఫ్ట్ చేయకపోవడం పనిచేయని నంబర్ ఇచ్చారని కారణాలుగా చూపించారు. దీని మీద విచారించిన సీబీఐ కోర్టు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఆ రోజున జగన్ లండన్ పర్యటన విషయంలో కానీ ఆయన విదేశీ పర్యటనలకు అనుమతి ఇచ్చే విషయంలో కానీ ఏ రకమైన తీర్పు వెలువరిస్తుంది అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.

ఫోన్ ఇష్యూతో :

ఇవన్నీ పక్కన పెడితే జగన్ ఫోన్ ఇష్యూ గతంలో ఎపుడూ రాలేదని ఇపుడే ఎందుకు వచ్చిందని వైసీపీ నేతలు అంటున్నారు. మరో వైపు చూస్తే జగన్ సీఎం గా ఉండగా ఒక ప్రముఖ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు పర్సనల్ ఫోన్ లేదని చెప్పినట్లుగా పేర్కొంటున్నారు. అలాగైతే మరి ఎవరి నంబర్ జగన్ సీబీఐ కి ఇచ్చారు అన్నది ఒక చర్చ. ఆ నంబర్ కూడా ఎందుకు పనిచేయలేదు, లేదా ఎందుకు రెస్పాండ్ కాలేదన్నది మరో చర్చ. ఏది ఏమైనా జగన్ కి సీబీఐ వరసగా మూడు సర్లు ఫోన్ చేయడం హాట్ టాపిక్ గానే ఉంది. గతంలో విదేశీ పర్యటనలు జగన్ చేశారు, మరి అపుడు సీబీఐ ఫోన్ చేసిందా లేదా అన్నది తెలియదు, ఒక వేళ చేసి ఉంటే ఆనాడు రెస్పాండ్ అయిన వారు ఇపుడు ఎందుకు అవలేదా అన్నది కూడా ప్రశ్నలుగా వస్తున్నాయి. చూడాలి మరి కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందో.

Tags:    

Similar News