బైరెడ్డికి భారీ ఆఫర్ ఇచ్చిన జగన్...అక్కడ ఫొకస్ ?

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసీపీకి చెందిన యువ నేత. ఆయన కర్నూలు జిల్లాలో డైనమిక్ యూత్ లీడర్ గా ఉన్నారు.;

Update: 2025-09-26 03:42 GMT

వైసీపీలో జగన్ సైలెంట్ గా చేయాల్సిన కసరత్తు చేస్తున్నారు. మొత్తం 175 అసెంబ్లీ పాతిక ఎంపీ సీట్లు ఉన్న ఏపీలో ఎవరు ఏమిటి ఎక్కడ అన్నది ఫుల్ గా అవగాహనతో ఉన్న జగన్ ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో పూర్తిగా లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు అని అంటున్నారు. జగన్ దృష్టిలో లిస్టులో ఉన్న వారికే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు దక్కుతుంది అని అంటున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ వైసీపీ ఇంచార్జిలు కానీ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జిలు కానీ వీరిలో అందరికీ టికెట్లు దక్కుతాయని అనుకుంటే పొరపాటే అంటున్నారు. వీరిలో ఎవరు బాగా పనిచేస్తే వారికే టికెట్ గ్యారంటీ అంటున్నారు. మరి కొందరి విషయంలో ఇప్పటికే ఫలనా నియోజకవర్గంలోకి వెళ్ళమని అధినేత చెప్పి మరీ పంపిస్తున్నారుట. అక్కడ వచ్చే ఎన్నికలకు పోటీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోమని కూడా చెబుతున్నారు అని అంటున్నారు.

ఈసారి గ్యారంటీ :

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసీపీకి చెందిన యువ నేత. ఆయన కర్నూలు జిల్లాలో డైనమిక్ యూత్ లీడర్ గా ఉన్నారు. ఆయనకు 2019, 2024 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఆయన ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేయాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. అయితే వైసీపీ హయాంలో శాప్ చైర్మన్ పదవి ఆయనకు దక్కింది. అలా నామినేటెడ్ పదవితో నెట్టుకొచ్చారు. ఆయన అడిగిన సీట్లు అయితే వైసీపీ అధినాయకత్వం ఇవ్వలేకపోతోంది. కర్నూల్, నంద్యాల, పాణ్యాం, శ్రీశైలం నియోజకవర్గాలలో బలమైన అభ్యర్ధులు వైసీపీకి ఉన్నారు అందులో మాజీ ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. దాంతో ఆయన కోసం జగన్ ఒక ఆఫర్ రెడీ చేశారు అని అంటున్నారు. సీటు అయితే గ్యారంటీ అని చెబుతున్నారు.

నంద్యాల ఎంపీగా :

వైసీపీకి సంబంధించి నంద్యాల ఎంపీ టికెట్ ని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇచ్చేందుకు జగన్ ఓకే చెప్పారు అని ప్రచారం అయితే సాగుతోంది. ఇక్కడ 2019లో గెలిచిన పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. కానీ ఈసారి మార్పులలో భాగంగా ఈ యువ నేతను నంద్యాల ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలని జగన్ పక్కా ప్లాన్ చేశారు అని అంటున్నారు. ఆయనకు ఈ మేరకు ఒక భారీ హామీ దక్కింది అని అంటున్నారు.

అక్కతో పోటీకి సై :

ఇక ఇపుడు చూస్తే నంద్యాల ఎంపీగా టీడీపీ నుంచి బైరెడ్డి శబరి ఉన్నారు. ఆమె సిద్ధార్థ రెడ్డి కి అక్క అవుతారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకే టికెట్ ఇచ్చే చాన్స్ ఉందని అంటున్నారు. దాంతో అదే కుటుంబానికి చెందిన బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డిని బరిలోకి దించడం ద్వారా నంద్యాల సీటుని గెలుచుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. నద్యాల ఎంపీ సీటు పరిధిలో గట్టిగా తిరగమని కూడా ఆయన సూచనలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. సో బైరెడ్డి వర్సెస్ బైరెడ్డిగా నంద్యాల ఎంపీ సీటుని వచ్చే ఎన్నికల్లో చూడవచ్చు అని అంటున్నారు.

Tags:    

Similar News