వైఎస్ ఫ్యామిలీని ఓడిస్తున్న బీటెక్ రవి కుటుంబం!

వైఎస్సార్ కుటుంబానికి అడ్డాగా పులివెందుల ఉంది. పులివెందుల పొలిమేరలల్లోకి అడుగు పెట్టడం ప్రత్యర్ధుల వల్ల అయితే కాదు.;

Update: 2025-08-13 07:45 GMT

వైఎస్సార్ కుటుంబానికి అడ్డాగా పులివెందుల ఉంది. పులివెందుల పొలిమేరలల్లోకి అడుగు పెట్టడం ప్రత్యర్ధుల వల్ల అయితే కాదు. అంతలా వైఎస్సార్ వీరభక్తులు అక్కడ ఉంటారు. వారికి తెలిసింది ఒక్కటే వైఎస్సార్ నాయకత్వమే. అలాంటి చోట వారి కంచుకోటను బద్ధలు కొట్టడం అంటే అది మామూలు విషయం కాదు. రిగ్గింగ్ చేసి ఓట్లు వేయించుకున్నారు అని ఆరోపణలు వచ్చినా ప్రత్యర్ధులు అంతలా హల్ చల్ చేశారు అంటే ఆ కాడికి వైఎస్సార్ అభిమానం మునుపటి కంటే బాగా వీగిపోయింది అని అర్ధం చేసుకోవాల్సిందే అంటున్నారు.

అచ్చొచ్చిన బీటెక్ సెంటిమెంట్ :

బీటెక్ రవి పులివెందులలో నాయకుడి నుంచి ఇపుడు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. ఆయన అతి పెద్ద రాజకీయ కుటుంబంతో ఢీ కొట్టి ఈ స్థాయికి వచ్చారు. ఆయన సెంటిమెంట్ టీడీపీకి పాజిటివ్ గా కలసివస్తూంటే వైసీపీకి యాంటీ సెంటిమెంట్ గా మారుతోంది. దానికి ఎన్నో ఉదాహరణలు చెప్పులోవాల్సి ఉంది. 2017లో చూస్తే ఇదే బీటెక్ రవి వైఎస్ వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించారు. వైఎస్ వివేకా జగన్ సొంత చిన్నాన్న. ఆయనకు అప్పటిదాకా ఎదురులేదు, ఓటమి అంతకంటే లేదు. అయితే స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ నుంచి బరిలోకి వచ్చిన వివేకాను ఓడించారు. అది తొలి దెబ్బ. అలా బీటెక్ రాజకీయం పులిన్వెందుల బరిలో నిలబడింది.

ఆయన సతీమణి సైతం :

ఇపుడు చూస్తే అదే సినారియో కనిపించింది. బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీని ఓడించారు. భారీ మెజారిటీతో ఆమె నెగ్గారు. దీంతో బీటెక్ రవి దంపతులు వైసీపీని కంచుకోటలో కూసాలు కదిలించే జంటగా పేరు సాధించారు అని చెప్పాలి. పులివెందుల జగన్ అడ్డా అని నిన్నటిదాకా అంతా అనుకునే మాటను చెరిపేసి అక్కడ పసుపు జెండాను ఎగరవేయడంలో బీటెక్ ఫ్యామిలీ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది.

ఎవరీ రవి :

అవును ఎవరీ రవి అని అంతా అనుకుంటారు. కానీ వైఎస్సార్ కోటలను బద్ధలు కొట్టడానికి ఆయన వచ్చిన వారు అని రాజకీయంగా టీడీపీ వారు చెప్పే మాట. ఆయన అసలు పేరు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి.

ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ ద్వారానే జరిగింది. ఆయన 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. అది తొలి పర్యాయం అన్న మాట.

రికార్డుతో అందరి ఫోకస్ :

అయితే గిర్రున ఆరేళ్ళు తిరిగేసరికి ఆయన 2017లో జరిగిన రాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో కడప స్థానిక సంస్థల స్థానం నుండి ఎమ్మెల్సీగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎ వివేకానంద రెడ్డి మీద పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు ఇలా మొట్టమొదటి సారిగా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఓటమి ఎరుగని వైస్సార్ కుటుంబం మీదే ఎమ్మెల్సీగా గెలిచి రాష్ట్ర స్థాయిలో చరిత్ర సృష్టించారు. ఇపుడు పులివెందులలో తొలిసారి పసుపు జెండా ఎగరేయడం ద్వారా మరోసారి బీటెక్ రవి చరిత్ర సృష్టించారు అని చెప్పాలి.

Tags:    

Similar News