79 అడుగుల స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూలిపోయింది.. వైరల్ వీడియో!

ఈ సందర్భంగా స్పందించిన గుయిబా మేయర్ మార్సెలో మారనాటా.. తుపాను సమయంలో గంటకు 80 నుంచి 90 కి.మీ మధ్య బలమైన గాలుల వేగాన్ని ధృవీకరించారు.;

Update: 2025-12-16 05:25 GMT

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి తెలియని వారు ఉండరు అని చెప్పినా అతిశయోక్తి కాదేమో. అలాంటి 79 అడుగులు (24 మీటర్లు) ఎత్తైన ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం బలమైన గాలుల ధాటికి కూలిపోయింది. దీనికి కారణం.. బ్రెజిల్ దక్షిణ భాగంలో తీవ్ర తుఫాను చెలరేగడమే. ఆ సమయంలో సుమారు 90 కి.మీ వేగంతో గాలులు వీచినట్లు చెబుతున్నారు.

అవును... బ్రెజిల్ దక్షిణ భాగంలో తీవ్ర తుఫాను రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలోని గువైబా నగరాన్ని అతలాకుతలం చేసింది. ఈ సమయంలో నగరంలోని హోవన్ మెగాస్టోర్ బయట ఏర్పాటు చేసిన 24 మీటర్ల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం తీవ్రమైన గాలుల ధాటికి కూలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా స్పందించిన గుయిబా మేయర్ మార్సెలో మారనాటా.. తుపాను సమయంలో గంటకు 80 నుంచి 90 కి.మీ మధ్య బలమైన గాలుల వేగాన్ని ధృవీకరించారు. ముఖ్యంగా.. నిర్మాణం కూలిపోవడానికి ముందు సరైన సమయంలో వేగంగా నడిచే బాటసారులు, స్టోర్ ఉద్యోగులు సమీపంలోని కార్లను తరలించడం వల్ల ఎటువంటి గాయాలు లేదా ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన హోవన్ మెగాస్టోర్ రిటైలర్ హవాన్ మాట్లాడుతూ.. భద్రతా ప్రోటోకాల్ కు అనుగుణంగా తమ సిబ్బంది శిథిలాలను వెంటనే తొలగించారని.. దుకాణం సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలగలేదని తెలిపారు.

వాస్తవానికి బ్రెజిల్ అంతటా నిర్మించబడిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేక ప్రతిరూపాలన్నీ కఠినమైన సాంకేతిక, ఇంజనీరింగ్ పరామీటర్స్ ప్రకారం నిర్మించబడి ధృవీకరించబడ్డాయని తెలిపారు. అయితే, ఈ ప్రత్యేకమైన తీవ్ర వాతావరణ పరిస్థితులను తట్టుకోవడంలో ఇది ఎందుకు విఫలమయ్యిందనేది తెలుసుకోవడానికి అంతర్గత దర్యాప్తు ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది.




Tags:    

Similar News