ఆ ఎమ్మెల్యే హిట్ లిస్టులోనే ఉన్నారా.. ?

శ్రీకాళ‌హ‌స్తి నుంచి తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి ఇంకా హిట్ లిస్టులోనే ఉన్నారా? లేక పార్టీ సానుకూలంగానే ఉందా? అనేది ఆస‌క్తిగా మారింది.

Update: 2026-08-15 00:30 GMT

శ్రీకాళ‌హ‌స్తి నుంచి తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి ఇంకా హిట్ లిస్టులోనే ఉన్నారా? లేక పార్టీ సానుకూలంగానే ఉందా? అనేది ఆస‌క్తిగా మారింది. తొలి రెండేళ్ల పాటు ఎమ్మెల్యే వ్య‌వ‌హ‌రించిన తీరు.. పార్టీకి ఇబ్బందిగా మారింది. అధికారుల‌పై దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డం.. పార్టీ నాయ‌కుల‌తోనూ స‌ఖ్య‌త లేక‌పోవ‌డం, ముఖ్యంగా కూట‌మి పార్టీల‌తో క‌లివిడి లేకుండా ఉండ‌డం వంటివి ఇటు పార్టీని అటు ఎమ్మెల్యేను కూడా క‌ల‌వ‌ర పెట్టాయి. దీంతో ఒక‌టికి రెండు సార్లు ఎమ్మెల్యేకు చెప్పి చూశారు.

మారాల్సిందేన‌ని.. మంత్రి లోకేష్ కూడా బొజ్జ‌ల‌కు చెప్పారు. దీంతో కొంత మేర‌కు మార్పు క‌నిపించింది. అయితే.. మ‌ళ్లీ తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాలు.. ఎమ్మెల్యేపై విమ‌ర్శ‌లు వ‌చ్చేలాచేస్తున్నాయ‌ని అంటున్నారు. ముఖ్యం గా యువ‌త పెడ‌దారి ప‌ట్ట‌డం.. ఇటీవ‌ల ఓ కానిస్టేబుల్పై క‌త్తితో దాడి చేసేందుకు ఓ యువ‌కుడు ప్ర‌య‌త్నించ‌డం తెలిసిందే. ఇత‌నిని అదే రీతిలో పోలీసులు ప‌నిష్ చేసినా.. అస‌లు ఇలాంటివి ఎందుకు తెర‌మీద‌కు వ‌స్తున్నాయన్న‌ది ప్ర‌శ్న‌. ఈ విష‌యంపైనే టీడీపీ ఆరా తీసింది.

నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ర‌గుతున్న ప‌రిణామాల‌పై నివేదిక‌ను కోర‌డం గ‌మ‌నార్హం. వెర‌సి ఇప్పుడు మ‌రోసారి ఎమ్మెల్యే ప‌నితీరుపై మ‌థ‌నం చేస్తున్నారు. ఇంటింటికీ టీడీపీ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే పాల్గొంటున్నా.. కూట‌మి నేత‌ల‌ను క‌లుపుకొని పోవ‌డం లేదని తెలిసింది. అదేస‌మ‌యంలో స్థానికంగా వైసీపీ పుంజుకుంటుండ‌డం కూడా టీడీపీ అధిష్టానం సీరియ‌స్‌గా తీసుకుంద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో వైసీపీకి కౌంట‌ర్ ఇవ్వ‌కుండా ఎమ్మెల్యే ఏం చేస్తున్నార‌న్న విష‌యంపై పార్టీ కూపీ లాగుతోంది.

వెర‌సి ఎమ్మెల్యే బొజ్జ‌ల వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. త్వ‌ర‌లోనే అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అవుతున్న‌ నేప‌థ్యంలో మ‌రోసారి కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్యేల‌కు క్లాస్ ఇవ్వాల‌ని.. ముఖ్యంగా వివాదాల్లో ఉన్న కొందరికి చంద్ర‌బాబు స్వ‌యంగా కౌన్సెలింగ్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఈ జాబితాలో బొజ్జ‌ల పేరు ఫ‌స్టే ఉంద‌ని అంటున్నారు. సో.. ఇప్ప‌టికైనా ఆయ‌న జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్ని కోణాల్లోనూ ప‌రిశీల‌న చేయ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్న నేప‌థ్యంలో బొజ్జ‌ల హిట్ లిస్టు నుంచి త‌ప్పించుకునేందుకు రెండేళ్ల స‌మ‌యాన్ని స‌జావుగా వినియోగించుకోవాల‌న్న సూచ‌న‌లు కూడావ‌స్తున్నాయి.

Tags:    

Similar News