నాలుగో సారి మోడీ.. క‌లిసి వ‌స్తున్న టీడీపీ - జ‌న‌సేన రాజ‌కీయం..!

త్వ‌ర‌లోనే కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేయ‌నున్నారు. ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను ఇప్ప‌టికే ప‌క్క‌న పెట్టారు.

Update: 2026-08-24 03:53 GMT

త్వ‌ర‌లోనే కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేయ‌నున్నారు. ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను ఇప్ప‌టికే ప‌క్క‌న పెట్టారు. అంటే.. రాజ్య‌స‌భ నుంచి మంత్రి వ‌ర్గంలోకి వ‌చ్చిన వారికి రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం ముగిసిన త‌ర్వాత‌.. రెన్యువ‌ల్ చేయ‌లేదు. దీంతో ఆటోమేటిక్‌గా వారికి ప‌ద‌వులు ఊడాయి. మ‌రో వైపు ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ రాజీనామా చేశారు. సో.. మొత్తంగా ఇప్పుడు ఐదు మంత్రి ప‌ద‌వులు ఖాళీ అయ్యాయి. అదే స‌మయంలో ప‌నితీరు ఆధారంగా మ‌రో న‌లుగురిపై వేటు ప‌డే అవ‌కాశం ఉంద‌ని డిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో కేంద్ర మంత్రి వ‌ర్గంలో ప్ర‌క్షాళ‌న స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీకి ప్రాధాన్యం పెరుగుతోంది. వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న వినాయ‌క‌చ‌వితికి ముందే మంత్రివ‌ర్గ మార్పులు ఉంటాయ‌ని సంకేతాలు వ‌స్తున్నాయి. దీం తో ద‌క్షిణాదికి ఎక్కువ‌గా ప్రాధాన్యం ల‌భించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఉత్త‌రాదిలో బీజేపీ బ‌ల‌హీన ప‌డుతున్న ద‌రిమిలా.. ద‌క్షిణాది పార్టీల‌పైనే ఆధార‌ప‌డే ప‌రిస్థితి రానుంది.

దీంతో జ‌న‌సేన‌కు ఒక‌టి.. టీడీపీకి ఈ ద‌ఫా రెండు స్థానాలు ద‌క్కినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. మిత్ర ప‌క్షాలుగా బీజేపీకి బ‌లంగా మ‌ద్ద‌తు ఇవ్వ‌డం తో పాటు ప్ర‌ధాని మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్న ప‌రిణామాలు టీడీపీ, జ‌న‌సేన‌కు బాగా క‌లిసి వ‌స్తున్నాయి. దీనికి తోడు వ‌చ్చే 2029 ఎన్నిక‌ల్లోనూ ఈ రెండు పార్టీల‌కు ప్ర‌జ లు ప‌ట్టం క‌ట్ట‌డం ఖాయ‌మ‌న్న వాద‌న బ‌ల‌ప‌డుతోంది. సో..మెజారిటీ ఓటు బ్యాంకు ఈ రెండు పార్టీల‌కు ద‌క్కితే.. అది ప‌రోక్షంగా బీజేపీకి బ‌లంగా మార‌నుంది.

ఉత్త‌రాదిలో ఓట్లు, సీట్లు త‌గ్గినా.. నాలుగో సారి ప్ర‌ధాని అయ్యే అవ‌కాశం మోడీకి ద‌క్షిణాది నుంచి టీడీపీ, జ‌న‌సేన అందించ‌నున్నాయ‌నడంలో సందేహం లేదు. ఈ నేప‌థ్యంలో ఈ రెండు పార్టీల‌కు ప్రాధాన్యం పెంచేదిశ‌గా క‌మ‌ల నాథులు అడుగులు వేస్తున్నారు. ఇదే జ‌రిగితే.. ప్ర‌స్తుత ఉన్న ఇద్ద‌రి నుంచి మ‌రో ముగ్గ‌రు నాయ‌కుల‌ను మంత్రులుగా తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని ఢిల్లీవ‌ర్గాలు చెబుతున్నాయి. వీరిలో లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉద‌య్ శ్రీనివాస్ పేరు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News