బీహార్ రిజల్ట్ తరువాత ఏమి జరుగుతుంది ?

బీహార్ లో ఏకంగా 40 మంది ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో కూడా గత మూడు విడతలలో బీజేపీ దాని మిత్రులే గెలుస్తూ వచ్చారు.;

Update: 2025-11-13 18:29 GMT

దేశంలో కీలకమైన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన బీహార్ రాష్ట్రం ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. బీహార్ హిందీ ప్రాంతంలో అతి ముఖ్యమైన రాష్ట్రం అని ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. ఇక్కడ ప్రజలు ఒకరిని ఆదరించారు అంటే దశాబ్దాలుగా అదే కొనసాగిస్తారు. గతంలో కాంగ్రెస్ తరువాత ఆర్జేడీ, ఆ తరువాత నితీష్ కుమార్ ఇలా బీహార్ ప్రజలు తమకు నచ్చింది అంటే అక్కున చేర్చుకుంటారు. ఇదిలా ఉంటే బీహార్ లో ఆర్జేడీ పాలనకు చెల్లు చీటీ రాసి రెండు దశాబ్దాలు అయింది. ఈ మధ్య కాలం అంతా నితీష్ కుమార్ దే.

తీర్పు ఏ మార్పుకో :

ఈసారి బీహార్ ప్రజలు ఇచ్చే తీర్పు ఏ మార్పుకో అన్న చర్చ కూడా ఉంది. బీహార్ ప్రజానీకం నెత్తికెత్తుకుని గెలిపించిన పార్టీయే దేశంలో అంటే జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతుంది. అది 2014 దాకా అంతా చూశారు. అప్పట్లో యూపీయే రాజ్యం ఏలింది. ఇక ఆ తర్వాత నుంచి ఎన్డీయే గెలుపు వెనకాల బీహార్ ప్రజలు ఉన్నారు. అయితే ఈసారి బీహార్ ఓటర్లు తీసుకునే నిర్ణయం కూడా జాతీయ రాజకీయాలను విశేషంగా ప్రభావితం చేయబోతోంది.

ఎక్కువ ఎంపీలు :

బీహార్ లో ఏకంగా 40 మంది ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో కూడా గత మూడు విడతలలో బీజేపీ దాని మిత్రులే గెలుస్తూ వచ్చారు. ఆ మద్దతు కూడడం వల్లనే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మూడు సార్లు ఏర్పాటు అయ్యేందుకు కారణం అయింది. అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీహార్ లో బీజేపీ జేడీయూని గెలిపిస్తున్నారు. అయితే బీహారీల నాడి పసిగట్టడం బహు కష్టం అంటారు. వారు బయటకు ఏమి చెప్పినా లోపల వేసే ఓటు గట్టిగానే ఉంటుంది. జాతీయ ప్రాంతీయ రాజకీయాల మీద రాజకీయాల మీద వారికి మంచి అవగాహన ఉంది.

జాతీయ ముఖ చిత్రంలో :

జాతీయ స్థాయిలో రాజకీయాలను ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ రాజకీయాలు ప్రభావితం చేయడం అన్నది గత నాలుగు దశాబ్దాలుగా సాగుతూ వస్తున్న విషయం. అందుకే ప్రాంతీయ రాజకీయాల మీద కూడా జాతీయ పార్టీలు ఆసక్తిని చూపిస్తూ వస్తున్నాయి. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆయా పార్టీలు అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఏ మాత్రం తేడా జరిగినా అది నేరుగా వచ్చి ఢిల్లీ పీఠాన్ని తాకుతుందని కూడా ఆలోచనలు వ్యూహాలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా యూపీ బీహార్ వంటి పెద్ద స్టేట్స్ చాలా కీలకంగా మారుతున్న నేపథ్యం ఉంది. జాతీయ ముఖ్య చిత్రాన్ని మార్చే కెపాసిటీ ఉన్న ఈ రాష్ట్రాల మీద రాజకీయ విశ్లేషకుల చూపూ ఉంటుంది.

Tags:    

Similar News