ఎన్డీయేకే ప‌ట్టం: బీహార్‌పై ఎగ్జిట్ పోల్ అంచ‌నా

ఈ క్ర‌మంలో తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల రెండో ద‌శ ముగిసిన వెంట‌నే ప‌లు సంస్థ‌లుఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశాయి.;

Update: 2025-11-11 13:50 GMT

దేశ‌వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడుతార‌న్న చ‌ర్చ మ‌రింత జోరందుకుంది. రెండో ద‌శ పోలింగ్ కూడా అయిపోయిన నేప‌థ్యంలో ఉత్త‌రాదిలో కీల‌కంగా మారిన ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు అటు కేంద్రంలోని ఎన్డీయే ప్ర‌భుత్వానికి, ఇటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ నేతృత్వంలో మ‌హాఘ‌ఠ్ బంధ‌న్‌కు కూడా కీల‌కంగా మారాయి. ఈ నేప‌థ్యంలో ఆది నుంచి కూడా ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై అంద‌రి చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలో తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల రెండో ద‌శ ముగిసిన వెంట‌నే ప‌లు సంస్థ‌లుఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశాయి.

బీహార్‌ప్ర‌జ‌లు మ‌రోసారి కూడా ఎన్డీయే కూట‌మి వైపే మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని దాదాపు అన్ని సంస్థ‌లు వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన‌న్డీయే కూట‌మి రాష్ట్రంలో అధికారంలో ఉంది. తాజాగా రెండు ద‌శ‌ల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మ‌హాఘ‌ఠ్ బంధ‌న్ ఈ ద‌ఫా పుంజుకుని అధికారంలోకి వ‌స్తుంద‌న్న అంచ‌నాలు తొలి నుంచి వినిపించాయి. అయితే.. అనూహ్యంగా ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌.. తుపాకీ-ల్యాప్‌టాప్ నినాదం జోరుగా ప‌నిచేసిన‌ట్టు ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు.

తాజా ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌ను బ‌ట్టి.. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా.. అధికారంలోకి వ‌చ్చేందుకు 122 స్థానాలు ద‌క్కాల్సి ఉంది. అయితే.. తాజాగా జ‌రిగిన రెండో ద‌శ పోలింగ్ త‌ర్వాత‌.. ప్ర‌జ‌లు ఎన్డీయే వైపే మొగ్గు చూపిన‌ట్టు ఎగ్జిట్ పోల్స్ సంస్థ‌లు పేర్కొన్నాయి.

దైనిక్ భాస్క‌ర్ : ఎన్డీయే 145–160, మ‌హాఘ‌ఠ్ బంధ‌న్ 73–91, ఇత‌రులు 5–10

పీపుల్స్ ఇన్‌సైట్‌: ఎన్డీయే 133–148, మ‌హాఘ‌ఠ్ బంధ‌న్ 87–102, జ‌న్ సురాజ్ పార్టీ 0–2, ఇత‌రులు 3–6

మ్యాట్రిజ్‌: ఎన్డీయే 147–167, మ‌హాఘ‌ఠ్ బంధ‌న్70–90

పీపుల్స్ ప‌ల్స్‌: ఎన్డీయే 133–159, మ‌హాఘ‌ఠ్ బంధ‌న్ 75–101, జ‌న్ సురాజ్ పార్టీ 0–5

Tags:    

Similar News