ఏపీలో రాజకీయ సంచలనాలు...బీజేపీ సంకేతాలు !
వైసీపీ మాజీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని లిక్కర్ స్కాం కి సంబంధించి ఈడీ విచారణకు పిలిచింది.;
ఏపీ రాజకీయాల్లో భారీ సంచలనాలు తొందరలో నమోదు అవుతాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చెప్పారు. చూస్తూ ఉండండి అంటూ ఆయన ఊరిస్తున్నారు. ఏపీలో మూడు పార్టీలతో కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. విపక్షంలో వైసీపీ ఉంది. ఇక కూటమి పాలనకు ఇరవై నెలలు పూర్తి అవుతున్నాయి. అంటే మూడవ వంతు అధికారం కరిగిపోయింది అన్న మాట. విపక్షంలో వైసీపీ నేతల మీద అరెస్టులు జైళ్ళు వంటివి జరుగుతున్నా పెద్ద స్థాయిలో అయితే ఏమీ జరగడం లేదు. అయితే తొందరలోనే భారీ సంచలనాలు అంటూ బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ మాధవ్ హింట్ ఇచ్చేశారు. మరి ఆ సంచలనాలు ఏమిటి ఎలా ఉండబోతున్నాయన్నదే విపరీతమైన రాజకీయ చర్చకు ఆస్కారం ఇస్తోంది.
విజయసాయి ట్వీట్ హీట్ :
వైసీపీ మాజీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని లిక్కర్ స్కాం కి సంబంధించి ఈడీ విచారణకు పిలిచింది. ఆయన ఈ నెల 22న విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపధ్యంలో విజయసాయిరెడ్డి కోటరీ అంటూ చేసిన ఈ ట్వీట్ రాజకీయ సెగలు పుట్టిస్తోంది. అమ్ముడుపోయిన కోటరీ మధ్య బంధీగా ఉన్న ప్రజా నాయకులు అంటూ ఆయన చేసిన ఈ ట్వీట్ వైసీపీని ఉద్దేశించినది అని చర్చ సాగుతూండగానే మాధవ్ కూడా రియాక్ట్ అయ్యారు. త్వరలో ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని ఆయన అంటున్నారు.
అవినీతికి శిక్ష అంటూ :
మాధవ్ చాలానే చెప్పారు. అవినీతి పరులకు శిక్ష తప్పదని కూడా జోస్యం చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో కేవలం లిక్కర్ అవినీతి మాత్రమే కాదని అనేక ఇతర అక్రమాలు జరిగాయని ఆయన అంటున్నారు అంతే కాకుండా ఎవరు ఎంతటి వారు అయినా అవినీతికి పాల్పడితే శిక్ష తప్పదని కూడా ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో భారీ ఎత్తున చర్యలకు దిగుతోందని కూడా చెప్పారు.
ఈడీ పిలుపుతో :
ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో వైసీపీ పట్ల కేంద్ర బీజేపీ పెద్దలు మెతకగా వ్యవహరిస్తున్నారు అని ప్రచారం అయితే ఆ మధ్య దాకా సాగింది. అయితే అలాంటిది ఏదీ లేదని ఇపుడు నెమ్మదిగా అర్ధం అవుతోంది అంటున్నారు. ఈడీ ముందు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మిధున్ రెడ్డిని హాజరు కమ్మని ఆదేశించడం మాజీ నేత విజయసాయిరెడ్డి కి పిలుపులు వెళ్ళడంతో ఢిల్లీ స్థాయిలో సీన్ అయితే మారుతోందని అంతా అంటున్నారు. ఏపీలో చూస్తే కూటమి పటిష్టంగా ఉంది. దాంతో కూటమికి మరింత బలం ఇచ్చేలా కేంద్ర బీజేపీ పెద్దలు వ్యవహరిస్తారు అని అంటున్నారు. అంటే గతంలో మాదిరిగా వ్యవహరించరని కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ రకమైన పరిణామాల నేపధ్యలోనే మాధవ్ ఏపీలో రాజకీయ సంచలనాలు అని కీలక వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు. మరి విజయసాయిరెడ్డి వేసిన ట్వీటూ మాధవ్ చేసిన ఘాటు వ్యాఖ్యలను సరిపోల్చుకుంటే ఏపీలో భారీ పొలిటికల్ సెన్షేషన్ కి తెర లేవనుందా అన్నదే చర్చ. చూడాలి మరి ఏమి జరుగుతుందో.