జగన్ కేసీఆర్...మోడీ వ్యూహంలో చిక్కుకున్నారా ?

ఏపీలో వైసీపీ తెలంగాణాలో బీఆర్ఎస్ ఇపుడు ప్రతిపక్షంలో ఉన్నాయి. రెండు పార్టీల మధ్య స్నేహం కూడా అలాగే ఉంది.;

Update: 2026-01-30 22:30 GMT

ఏపీలో వైసీపీ తెలంగాణాలో బీఆర్ఎస్ ఇపుడు ప్రతిపక్షంలో ఉన్నాయి. రెండు పార్టీల మధ్య స్నేహం కూడా అలాగే ఉంది. వైఎస్సార్ సమయంలో ఉమ్మడి ఏపీలో ఆయన సీఎం గా ఉండగా తీవ్రంగా వ్యతిరేకించిన కేసీఆర్ ఆయన మరణానంతరం జగన్ తో మాత్రం సాన్నిహిత్యం పెంచుకున్నారు. అప్పటికే ఏపీ విభజన మీద క్లారిటీ ఉండడంతో చెరో రాష్ట్రానికి ఏలికలు కావాలని అనుకున్నారు దాని ప్రకారమే 2014 నుంచి జగన్ ఏపీకి సీఎం అని బీఆర్ఎస్ ప్రచారం చేస్తూ వచ్చింది అనుకున్నట్లుగా తెలంగాణాకు కేసీఆర్ సీఎం గా రెండు సార్లు పనిచేశారు కానీ జగన్ కి 2019 లో మాత్రమే చాన్స్ దక్కింది. ఇక 2023లో కేసీఆర్ ఓటమి పాలు అయితే ఏపీలో జగన్ 2024 లో మాజీ సీఎం గా మారి కేసీఅర్ పక్క సీటులోకి వచ్చేశారు.

గ్రాఫ్ పెరగడం లేదా :

కేసీఆర్ మంచి వ్యూహకర్త, అలాగే జనాన్ని కదిలించే నాయకుడు. కానీ ఆయన ఇపుడు ఏడు పదుల పై దాటిన వయసులో ఉన్నారు. అంతే కాదు మునుపటి రాజకీయ పరిస్థితులు తెలంగాణాలో లేవు, కాంగ్రెస్ అధికారంలో ఉంది, జాతీయ పార్టీగా బీజేపీ బలంగా మారి బీఆర్ ఎస్ ప్లేస్ లోకి చొచ్చుకుని వచ్చే ప్రయత్నం చేస్తోంది. మధ్యన పది బీఆర్ఎస్ నలుగుతోంది. దానికి తోడు అన్నట్లుగా బీఆర్ఎస్ లో వర్గ పోరు ఏకంగా కుమార్తె కవిత గులాబీ గూడు దాటి బయటకు వెళ్ళడం అన్నది ఒక సవాల్ గా మారింది. ఇక కేసీఆర్ గత రెండేళ్ళుగా పూర్తిగా ఫాం హౌస్ కే పరిమితం కాగా కేటీఆర్ హరీష్ రావు ల రాజకీయం ఏ మాత్రం సరిపోవడం లేదు, దాంతో బీఆర్ ఎస్ గ్రాఫ్ ఎక్కడా పెరగడం లేదు అని అంటున్నారు.

వైసీపీ డిటోగానే :

కట్ చేస్తే ఏపీలో వైసీపీ పరిస్థితి కూడా అలాగే ఉంది అని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్ గత ఇరవై నెలల నుంచి బెంగళూరు కే పరిమితం అయ్యారు. ఆయన జనంలోకి పెద్దగా రావడం లేదు, పైగా అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు చట్ట సభకు నెగ్గి కూడా దూరంగా ఉన్నారు. ఇది జనంలో వ్యతిరేకతను పెంచుతోంది. మరో వైపు జగన్ తరువాత ఆ స్థాయిలో పార్టీని నడిపించే వారు వైసీపీలో లేకపోవడం వ్యూహాల లేమి కూటమి బలంగా ఉంటూ వేసే ఎత్తుగడలతో వైసీపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఇది ఎంతదాకా వచ్చింది అంటే పులివెందులలో జెడ్పీటీసీకి ఉప ఎన్నిక జరిగితే వైసీపీకి డిపాజిట్లు గల్లంతు కావడం వరకూ అని గుర్తు చేస్తున్నారు.

తెలుగు జనాల మూడ్ :

ఇక తెలుగు రాజకీయాల మీద జాతీయ స్థాయిలో పరిస్థితులు ప్రభావం చేస్తున్నాయి. కాంగ్రెస్ కొంత వీక్ కావడం మోడీ వంటి బలమైన నాయకుడు ఎన్డీయేకు సారధ్యం వహించడం వల్ల బీజేపీ తెలుగు రాష్ట్రాలలో తన ప్రభావం చూపిస్తోంది. ఏపీలో కూటమిలోలో బీజేపీ కొనసాగుతోంది. దాంతో కూటమికి అది శ్రీరామ రక్షగా మారుతోంది. తెలంగాణాలో ఆల్టర్నేషన్ తామే అంటూ పాలిటిక్స్ చేస్తోంది. ఈ క్రమంలో ఒకసారి బీఆర్ఎస్ మరోసారి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చిన జనాలు ఈసారి బీజేపీ వైపు కూడా చూస్తారు అన్న లెక్కలో కమలం పార్టీ స్కెచ్ గీస్తూ ముందుకు సాగుతోంది. ఈ పరిణామాల నేపధ్యంలో దేశవ్యాప్తంగా మోడీ ఇమేజ్ తెలుగు రాష్ట్రాల మీద గట్టిగానే ఉంది అని అంటున్నారు.

గెలుపు ఆశలు ఎంత :

ఏపీలో చూస్తే కూటమి పట్లనే జనాల మొగ్గు ఉందని తాజగా వచ్చిన ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చెబుతోంది. ఇక్కడ వైసీపీకి గతానికి కంటే ఓటు షేర్ తగ్గుతుందని సీట్లు తగ్గుతాయని చెబుతూంటే తెలంగాణాలో కూడా ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏ మాత్రం మారలేదని చెబుతోంది. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఒక్క ఎంపీ సీటు కూడా దక్కలేదు, ఈసారి చూస్తే బీఆర్ఎస్ ఓటు షేర్ 2024 లో వచ్చిన 16.5 శాతం నుంచి 18 శాతం దాకా పెరుగుతుంది కానీ దీని వల్ల కొత్తగా సీట్లు వచ్చే సీన్ ఏదీ ఉండబోదని స్పష్టంగా చెబుతోంది.

మోడీ మ్యాజిక్ తో :

అదే విధంగా చూస్తే కాంగ్రెస్ ఓటు షేర్ 40.1 శాతం నుంచి 41 శాతానికి పెరిగిందని చెబుతోంది. బీజేపీ ఓటు షేర్ 2024 లో 35 శాతంగా ఉంటే ఈసారి కొంత అటూ ఇటూ అయినా సీట్లు ఆ ఏడెనిమిది అలాగే సాధిస్తుందని చెబుతోంది. మొత్తం మీద చూస్తే ఎంపీ ఎన్నికల్లో పోరు కాంగ్రెస్ బీజేపీ వంటి రెండు జాతీయ పార్టీల మధ్యనే ఉండబోతోంది అని ఈ సర్వే అంటోంది. మోడీ ప్రభావం బీజేపీని తెలంగాణాలో ముందున ఉంచుతూంటే బీఆర్ఎస్ వెనకబడుతోంది. ఏపీలో కూడా అచ్చం ఇలాంటి వాతావరణమే ఉంది. మోడీ మ్యాజిక్ తో వైసీపీకి ఓటూ సీట్లూ రెండూ తగ్గుతాయని లెక్క వేస్తోంది.

Tags:    

Similar News