• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చెత్త పన్నుపై ఏపీ సర్కార్...

చెత్త పన్నుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!

| ఈ నిర్ణయంపై అప్పట్లో కూటమి నేతలు వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

By - Tupaki Desk
Update: 2025-02-22 07:56 GMT

గత ప్రభుత్వ హయాంలో చెత్తపై పను వేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నిర్ణయంపై అప్పట్లో కూటమి నేతలు వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలోనూ అది కీలక అస్త్రంగా మారింది. ఈ సమయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.

అవును... చెత్తపై పన్ను విషయం గత ప్రభుత్వ హయాంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సమయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. 2024 డిసెంబర్ 31 నుంచి చెత్త పన్ను రద్దు అమల్లోకి వచ్చినట్లు మున్సిపల్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ సందర్భంగా.. చెత్త పన్ను వసూళ్లను నిలిపివేస్తూ గత ఏడాది డిసెంబర్ లో కూటమి సర్కార్ తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించింది. దీనికి గవర్నర్ అనుమతితో ఇటీవలే గెజిట్ విడుదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది.

ఇందులో... చెత్త పన్ను వసూళ్లకు అవకాశం కల్పిస్తూ ఏపీ మున్సిపల్ చట్టం 1965లో చేర్చిన సెక్షన్ 170-బి, మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లోని సెక్షన్ 491-ఏ ను తొలగిస్తున్నట్లు ప్రభుతం పేర్కొంది. దీంతో.. ఇకపై ఏపీలో చెత్తపై పన్ను ఉండదు!

కాగా... నవంబర్ 2021లో ప్రజల నుంచి వైసీపీ ప్రభుత్వం చెత్త పన్ను వసూలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సుమారు రూ.187.02 కోట్ల మేర వసూలు చేసింది. దీనిపై కూటమి పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి.. అయినప్పటికీ జగన్ సర్కార్ పరిగణలోకి తీసుకోలేదు.. ఎన్నికల ప్రచారంలోనూ ఇది కీలకంగా మారింది.

Tags:    
  • AndhraPradesh 
  • GarbageTax 
  • MunicipalReform 
  • YSRCP 
  • Coalitiongovernment 
  • Taxabolition 
  • December31 
  • 2024 
  • MunicipalActAmendment 
  • GovernorApproval 
  • Criticism 
  • YSRCongress 
  • Politicalcontroversy 
  • Wastetaxremoval 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS