మహిళలపై అనిరుద్ ఆచార్య కీలక వ్యాఖ్యలు.. డబ్బుంటే చాలు ఎవడైనా ఓకే అంటూ?
ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియా యుగమే నడుస్తోంది. ఎలాంటి చిన్న వ్యాఖ్యలు చేసినా సరే ఖచ్చితంగా వారి పేరు మారుమోగేలా చేస్తున్నారు.;
ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియా యుగమే నడుస్తోంది. ఎలాంటి చిన్న వ్యాఖ్యలు చేసినా సరే ఖచ్చితంగా వారి పేరు మారుమోగేలా చేస్తున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలే కాకుండా రాజకీయ నాయకులు, జ్యోతిష్యులు, ప్రవచనాలు చెప్పేవారు ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో కొంతమంది మాట్లాడిన మాటల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మత ప్రచారకుడుగా పేరుపొందిన అనిరుద్ ఆచార్య మహారాజ్ తన ప్రవచనాలతో ఎంతోమంది భక్తులను సంపాదించారు. కానీ ఆయన ప్రవచనాలు ఈమధ్య ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి.
మహిళలపై అనిరుద్ ఆచార్య సంచలన కామెంట్లు..
సమాజంలో ఉండే కొన్ని వర్గాలను టార్గెట్ చేసుకొని మరీ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల కలియుగంలో భార్యాభర్తల సంబంధాలపైన చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాస్పదంగా మారుతున్నాయి. మధురా లోని ఒక ఆధ్యాత్మిక ప్రసంగంలో అనిరుద్ ఆచార్య మహారాజ్ రామాయణంలోని సీతా అపహరణ విషయాన్ని నేటి కాలంలో భార్యాభర్తల సంబంధాలతో పోల్చారు.."ప్రస్తుతం సమాజంలో డబ్బు కోసం భార్యలు తమ భర్తలను వదిలి పారిపోతున్నారంటూ ఆరోపణలు చేశారు".
సీత అపహరణ ఘట్టాన్ని అవహేళన చేస్తూ..
ఒకవేళ రావణుడు సీత దేవిని అపహరించడానికి వచ్చినట్లుగా ఇప్పుడున్న భార్యలను ఎత్తుకెళ్లడానికి ఇంటి దగ్గరికి వస్తే.. వారే స్వయంగా అతని విమానంలో దూకి మమ్మల్ని తీసుకువెళ్ళండి అని బ్రతిమలాడుతారంటూ మాట్లాడారు.. అంతేకాకుండా వారే స్వయంగా రావణుడికి ఉత్తరాలు రాసి నేను ఇక్కడ ఉన్నాను నన్ను అపహరించుకోవడానికి రండి అని ఆహ్వానిస్తారంటూ వ్యాఖ్యానించారు. అయితే అనిరుద్ ఆచార్య చేసిన ఈ వ్యాఖ్యలు రామాయణంలోని పవిత్రతను సైతం దెబ్బతీసేవిగా ఉన్నాయని అలాగే మహిళలను కించపరిచేవిగా ఉన్నాయంటూ చాలామంది మాట్లాడుతున్నారు. అనిరుద్ ఆచార్య మహారాజ్ ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం ఇదేమి మొదటిసారి కాదు గతంలో కూడా ఎన్నోసార్లు విమర్శించారు.
వివాదాలలో ఇరుక్కోవడం ఇదేం తొలిసారి కాదు..
ముఖ్యంగా బాల్య వివాహాలను ప్రోత్సహించాలనే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించాయి.. ఇండియాలో అమ్మాయిల పెళ్లి వయసు 18 సంవత్సరాల కంటే ముందుగానే ఉండాలంటూ మాట్లాడారు.ఈ విషయం పైన కూడా చాలామంది విమర్శలు కూడా చేశారు. ప్రస్తుతం మారిన జీవన శైలిలో భాగంగా లివ్ ఇన్ సంబంధాల పైన కూడా ఈయన చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి.. లివ్ ఇన్ రిలేషన్ ను కుక్కలు పిల్లుల ప్రవర్తనతో పోల్చేశారు. ఇలాంటివన్నీ కూడా కుక్కల సంస్కృతి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చాలామందికి ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ విషయాల పైన కొంతమంది భిన్నాభిప్రాయాలు సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. ఆయన మద్దతుదారులు మాత్రం మా గురువు నిజమే మాట్లాడుతున్నారని, సమాజానికి సరైన మార్గాన్ని చూపించబోతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఇలాంటి దుర్మార్గపు మాటలు మాట్లాడే వారిని అంత సులభంగా వదిలిపెట్టకూడదు అని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం..