మెంబర్‌షిప్ వివాదంలో సెటిల్‌మెంట్ కు అమెజాన్
ఈ కామర్స్ సైట్స్ లో అమెజాన్ ప్రైమ్ ఓ అగ్ర సంస్థ. అమెజాన్ ప్రైమ్ నుంచి ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలంటే రెండు పద్ధతులున్నాయి.;
సోషల్ మీడియా విపరీతంగా పెరగడంతో పాటూ, అందరూ తమ తమ పనుల్లో బిజీ అవడంతో ఏది కావాలన్నా ఆన్ లైన్ నుంచే కొనుగోలు చేస్తున్నారు. ప్రజలకు ఎన్నో ఈ కామర్స్ సైట్స్ అందుబాటులోకి రావడంతో ప్రతీదీ దాన్నుంచే కొనేస్తున్నారు. దానికి తోడు పండగలను, కొన్ని ముఖ్య రోజులను దృష్టిలో పెట్టుకుని సేల్ ను కూడా నిర్వహిస్తూ వినియోగదారుల్ని ఎట్రాక్ట్ చేస్తూ వస్తుంటాయి ఈ కామర్స్ సైట్స్.
ఈ కామర్స్ సైట్స్ లో అమెజాన్ ప్రైమ్ ఓ అగ్ర సంస్థ. అమెజాన్ ప్రైమ్ నుంచి ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలంటే రెండు పద్ధతులున్నాయి. వినియోగదారులకు మెంబర్‌షిప్ ఉంటే ఓ ధర, ఓ రకమైన డెలివరీ ఇస్తే, మెంబర్‌షిప్ లేని వారికి కాస్త లేటుగా ఆర్డర్ ను డెలివరీ చేస్తూ ఉంటుంది. అందుకే ఎంతో మంది వినియోగదారులు ఈ మెంబర్‌షిప్ ను తీసుకుని అమెజాన్ సేవలను పొందుతున్నారు.
మెంబర్‌షిప్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఇబ్బందులు
అయితే ఈ మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత దాన్ని మళ్లీ క్యాన్సిల్ చేసుకోవడానికి కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారంటూ అమెజాన్‌పై ఎన్నో ఫిర్యాదులు రాగా, దానిపై ఫెడరల్ ట్రేడ్ కమిషన్ దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే ఈ వివాదం సాల్వ్ అవడానికి అమెజాన్ 2.5 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు రెడీ అయింది.
అనుకోకుండా ప్రైమ్ లో జాయిన్ అయి, తమ మెంబర్‌షిప్ ను క్యాన్సిల్ చేసుకోవడానికి ఇబ్బందిపడిన కస్టమర్లకు అందులోని 1 బిలియన్ డాలర్లను జరిమానా రూపంలో చెల్లించనున్నట్టు అమెజాన్ తెలిపింది. సెటిల్‌మెంట్ ఆర్డర్ వచ్చాక 90 రోజుల్లోపు ఆ అమౌంట్ కస్టమర్లకు తిరిగి చెల్లించే ఛాన్సుంది. కస్టమర్లు ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోకుండా కొనుగోలు చేయడాన్ని కావాలనే అమెజాన్ కష్టతరం చేసిందని, ఎంతోమంది తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారని, దీనిపై అప్పీళ్లకు వెళ్లే బదులు సమస్యను త్వరగా సాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే అమెజాన్ ఈ డిసెషన్ తీసుకుని ఉంటుందని బ్యూరో ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డైరెక్టర్ ముఫారిజ్ తెలిపారు. కాగా ఈ విషయంలో అమెజాన్ ప్రతినిధి మార్క్ బ్లాఫ్కిన్ మాట్లాడుతూ, తమ కస్టమర్లు ప్రైమ్ మెంబర్‌షిప్ ను తీసుకోవడానికి, దాన్ని క్యాన్సిల్ చేసుకోవడాన్ని మరింత ఈజీ చేయడానికి తమ టీమ్ కృషి చేస్తుందన్నారు.