• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబులా ఏఐ డీప్‌ఫేక్...

చంద్రబాబులా ఏఐ డీప్‌ఫేక్ వీడియో కాల్‌ : రూ.80 వేలు స్వాహా.. విశాఖ వాసికి మోసం

| తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్లు, వారి రూపాలను వాడుకుని డీప్ ఫేక్ వాట్సాప్ కాల్ చేసి విశాఖకు చెందిన ఓ వ్యక్తిని మోసం చేశారు.

By - Tupaki Political Desk
Update: 2026-06-13 17:30 GMT

సాంకేతికత ఎంత వేగంగా ఎదుగుతోందో, సైబర్ నేరగాళ్లు దాన్ని అంతకంటే వేగంగా వాడుకుంటూ కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. నిన్నమొన్నటి వరకు కేవలం ఫోన్ కాల్స్, ఓటీపీల ద్వారా దోచుకున్న కేటుగాళ్లు.. ఇప్పుడు ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వాడుకుంటూ ప్రముఖుల రూపాలను సృష్టించి బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్లు, వారి రూపాలను వాడుకుని డీప్ ఫేక్ వాట్సాప్ కాల్ చేసి విశాఖకు చెందిన ఓ వ్యక్తిని మోసం చేశారు. ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీతో చంద్రబాబు, లోకేశ్ మాట్లాడినట్లుగానే బాధితుడిని మోసం చేయడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

భూ వివాదం అడ్డుపెట్టుకుని..

విశాఖపట్నం సీతంపేటకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కొంతకాలంగా ఒక భూ వివాదంతో ఇబ్బంది పడుతున్నాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు అతనికి వల వేశారు. సాధారణంగా వచ్చే ఫోన్ కాల్స్ అయితే ఎవరైనా అనుమానిస్తారని భావించిన కేటుగాళ్లు.. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రూపం, గొంతును పోలిన ఏఐ డీప్‌ఫేక్ సాంకేతికతను ఉపయోగించారు. బాధితుడికి వాట్సాప్ ద్వారా నేరుగా వీడియో కాల్ చేశారు. స్క్రీన్‌పై సాక్షాత్తూ సీఎం చంద్రబాబు కనిపిస్తూ, ఆయన గొంతుతోనే మాట్లాడటంతో బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. పైగా, జీవీఎంసీ కమిషనర్‌పై ఉన్న లంచం ఆరోపణలను నిరూపిస్తే, సదరు భూ వివాదాన్ని తక్షణమే పరిష్కరిస్తామని నమ్మబలికారు. అది నిజమైన కాల్ కాదని గుర్తించలేకపోయిన బాధితుడు మోసగాళ్లు చెప్పినట్లు చేసి నష్టపోయాడని చెబుతున్నారు.

మొదట నమ్మకం కుదిరిన తర్వాత, ఫైల్ ప్రాసెసింగ్, ఇతర ఖర్చుల పేరిట విడతల వారీగా శ్రీనివాస్ రెడ్డి నుండి రూ.80,000 వసూలు చేశారని చెబుతున్నారు. ఆ తర్వాత కూడా మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు, వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన శ్రీనివాస్ రెడ్డి.. తాను మోసపోయానని గ్రహించి, వెంటనే విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

12 నిమిషాల మాయాజాలం

సాధారణంగా సైబర్ కాల్స్ ఒకటి లేదా రెండు నిమిషాల్లో ముగుస్తాయి. కానీ ఈ కేసులో నేరగాళ్లు ఏఐ సాంకేతికతను ఎంత పక్కాగా వాడారంటే.. ఒక వీడియో కాల్ ఏకంగా 12 నిమిషాల పాటు మాట్లాడించారు. బాధితుడుకి ఊరట కలిగేలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ నమ్మకం కలిగించారని చెబుతున్నారు. దీంతో సాంకేతికతను మోసగాళ్లు ఎంత ప్రమాదకరంగా వాడుకుంటున్నారో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ అంటున్నారు. ఈ ఘటనతో ప్రజలకు ఒక మేలుకొలుపుగా ఉండాలని పోలీసులు అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మోసాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ ద్వారా నేరగాళ్లు ఇప్పుడు ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

సీఎం, మంత్రులు వంటి ప్రముఖులు లేదా అధికారుల ఫొటోలను వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టుకుని డబ్బులు దండుకునే ప్లాన్ అమలు చేయడానికి వెనకాడని పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఇంటర్నెట్‌లో దొరికే ప్రముఖుల వీడియోలు, ఆడియో క్లిప్పులను ఏఐ సాఫ్ట్‌వేర్లలో ఉపయోగించి.. వారు నిజంగానే లైవ్‌లో మాట్లాడుతున్నట్లు వీడియో కాల్స్ సృష్టించడం,

గొంతును మార్చడం ద్వారా డబ్బులు గుంజుకుంటారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Tags:    
  • aideepfake 
  • cybercrime 
  • whatsappscam 
  • andhrapradesh 
  • chandrababunaidu 
  • naralokesh 

Similar News

జైలు - బెయిల్ రాజకీయాల కోసం పొత్తు పెట్టుకోలేదు: వైసీపీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

2026-11-22 12:30 GMT

బండి సంజయ్ టార్గెట్ నెరవేరుతుందా? అసలు గురి 2028 ఎన్నికలేనా?

2026-11-22 11:36 GMT

టెన్షన్ ఎందుకు...లైట్ తీస్కో బ్రో !

2026-11-22 11:35 GMT

ఇమ్మిగ్రేషన్ అధికారుల దుర్మార్గం.. ఫ్లైట్ ఎక్కుతుండగా లాక్కేళ్లారు.. కూతురి ఆర్తనాదాలు వైరల్

2026-11-22 11:34 GMT

టీమిండియాలో సిరాజ్ కు దక్కని చోటు.. సెలెక్షన్ చుట్టూ రాజకీయ దుమారం..

2026-11-22 11:28 GMT

జగన్ లాంటి మనస్తత్వం ఎవరికి లేదు.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

2026-11-22 11:24 GMT

బాండ్ పేపర్లు.. రూ.కోట్ల ఆఫర్లు : పంచాయతీ ఎన్నికల్లో హామీల జాతర

2026-11-22 11:20 GMT

వరుణుడా.. మజాకా.. చలికాలంలోనూ తుఫాన్ల వెబ్ సిరీస్.. క్లైమాక్స్ ఎప్పుడో?

2026-11-22 10:55 GMT

అవెంజర్స్: ఎండ్‌గేమ్ రికార్డును బద్దలు కొట్టిన GTA 6.. ఒక్క రోజులోనే రూ. వేల కోట్ల వసూళ్లు!

2026-11-22 10:33 GMT

రూ.800 కోట్ల కలల సాకారం.. ఐఐటీ క్లాస్‌రూమ్ నుంచి మెటా సూపర్ ఇంటెలిజెన్స్ వరకు ఓ భారతీయుడి అద్భుత ప్రస్థానం

2026-11-22 04:34 GMT

పుష్క‌రాల‌కు మోడీ వ‌స్తున్నారు.. ఏర్పాట్లు అద‌రాలి: చంద్ర‌బాబు

2026-11-22 04:32 GMT

టెస్టు క్రికెట్‌లో టీమ్‌ఇండియా విధ్వంసం.. రికార్డులన్నీ బద్దలు.. పంత్‌ ఖాతాలో అరుదైన ఘనత

2026-11-22 04:32 GMT

Copyright @2026

Powered by Blink CMS