• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విమాన ప్రమాదంలో అద్భుతం.....

విమాన ప్రమాదంలో అద్భుతం.. ఎవరీ మృత్యుంజయుడు?

| ఈ సందర్భంగా స్పందించిన అహ్మదాబాద్ సీపీ జీఎస్ మాలిక్... ఈ ప్రమాద ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారని తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2025-06-12 14:49 GMT

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన ప్రతీఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. గురువారం మధ్యహ్నం 1:39 గంటల ప్రాంతంలో టెకాఫ్ అయిన తర్వాత కొంత ఎత్తులోకి వెళ్లి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఓ అద్భుతం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అహ్మదాబాద్ పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు!

అవును... అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఎవరూ బ్రతికి లేరని, ఇది షాకింగ్ విషయమని ప్రకటనలు వెలువడినట్లు ప్రచారం జరిగిన కాసేపట్లోనే.. ఓ వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడినట్లు అహ్మదాబాద్ పోలీసులు నిర్థారించారు. ఈ సందర్భంగా 11ఏ సీటులో కూర్చున్న ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడని వెల్లడించారు.

ఈ సందర్భంగా స్పందించిన అహ్మదాబాద్ సీపీ జీఎస్ మాలిక్... ఈ ప్రమాద ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారని తెలుస్తోంది. ఇందులో భాగంగా... 11ఏ నెంబర్ సీట్ లోని ప్రయాణికుడు రమేశ్ బిశ్వాస్ సజీవంగా బయటపడినట్లు తెలిపిన... ప్రస్తుతం అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించినట్లు కథనాలొస్తున్నాయి!

ఈ సందర్భంగా.. ప్రమాద స్థలం నుంచి గాయాలతో నడుచుకుంటూ వస్తున్న ఆ వ్యక్తి దృశ్యాలు వైరల్ గా మారాయి. దీంతో... ఎవరీ మృత్యుంజయుడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతూ, ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఇది కచ్చితంగా అద్భుతం అని కొనియాడుతున్నారు. మరోపక్క ఆ వ్యక్తి నిజంగానే విమానంలోని ప్రయాణికుడా.. లేక, ప్రమాదం జరిగిన జనావాసాల్లోని బాధితుడా అనే చర్చా జరుగుతుంది!

ఇదే సమయంలో... ప్రమాదానికి కొన్ని సెకన్ల ముందే విమానం నుంచి బయటకు దూకాడనే ప్రచారమూ తెరపైకి వచ్చింది. ఏది ఏమైనా ఈ మృత్యుంజయుడు బయటకు వచ్చి, తన అనుభావాన్ని చెబితే తప్ప వాస్తవ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు!

Tags:    
  • AirIndiaCrash 
  • AhmedabadPlaneCrash 
  • MiraculousSurvivor 
  • TollywoodNews 
  • AviationIncident 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS