యువతలో వస్తున్న మార్పు.. ఇకపై అలాంటి కష్టాలు ఉండవా?

ఒక ఉద్యోగి మానసికంగా అలసిపోయి ఆఫీస్‌కు వస్తే, అతడు సీట్లో కూర్చున్నప్పటికీ పూర్తిస్థాయిలో పని చేయలేడు. దీన్నే కార్పొరేట్ పరిభాషలో 'ప్రెజెంటీయిజం' అంటారు.

Update: 2026-07-15 06:36 GMT

ఒక దేశ భవిష్యత్తు, ఆర్థిక బలం పూర్తిగా అక్కడి యువత చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యంగా 30 ఏళ్ల వయసులో ఉన్నవారే కార్పొరేట్, ఐటీ, మేనేజ్‌మెంట్ రంగాలను నడిపించే అసలైన ఇంజన్లు. కానీ, దేశ ఆర్థిక రథాన్ని పరుగులు తీగించాల్సిన ఈ కీలక వయసు యువత ఇప్పుడు మానసిక అలసట, మతిమరుపు, ఏకాగ్రత లోపంతో కొట్టుమిట్టాడుతోంది. ఇది కేవలం వారి వ్యక్తిగత ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, దేశ ఆర్థిక ఉత్పాదకతను వెనుకకు లాగే ఒక పెను ముప్పు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ పురోగతికి జరిగే నష్టం ఊహించలేము.

దేశ రథచక్రాలు నెమ్మదిస్తున్నాయా?:

ముప్పై ఏళ్ల వయసు అంటే కెరీర్‌లో అత్యున్నత నిర్ణయాలు తీసుకునే సమయం. ఐటీ, మేనేజ్‌మెంట్ రంగాలలో కీలకమైన ప్రాజెక్టులను లీడ్ చేసేది ఈ వయసు వారే. అయితే, మెదడు చురుకుదనం తగ్గి, ఏకాగ్రత లోపించడం వల్ల వారి 'డెసిషన్ మేకింగ్ పవర్' దారుణంగా పడిపోతోంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల కంపెనీల ప్రాజెక్టులు ఆలస్యమవ్వడమే కాకుండా, క్వాలిటీ ఆఫ్ వర్క్ పూర్తిగా తగ్గిపోతోంది. ఇది నేరుగా కంపెనీల లాభాలపై దెబ్బకొడుతోంది.

కంటికి కనిపించని భారీ ఆర్థిక నష్టం:

ఒక ఉద్యోగి మానసికంగా అలసిపోయి ఆఫీస్‌కు వస్తే, అతడు సీట్లో కూర్చున్నప్పటికీ పూర్తిస్థాయిలో పని చేయలేడు. దీన్నే కార్పొరేట్ పరిభాషలో 'ప్రెజెంటీయిజం' అంటారు. అంటే మనిషి ఉంటాడు కానీ ఉత్పాదకత ఉండదు. ఇక దీనివల్ల కంపెనీలకు, దేశ జిడిపికి జరిగే కంటికి కనిపించని నష్టం వేల కోట్లలో ఉంటుంది. ఇక యువతలో సృజనాత్మకత తగ్గిపోతే కొత్త ఆవిష్కరణలు ఆగిపోతాయి, ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో దేశం వెనుకబడిపోయే ప్రమాదం ఉంది.

కంపెనీల మైండ్‌సెట్ మారాల్సిన సమయం:

ఇకపై ఇలాంటి నష్టాలు రాకుండా ఉండాలంటే కార్పొరేట్ రంగంలో పెద్ద మార్పు రావాలి. కేవలం ఉద్యోగుల నుంచి 9 లేదా 10 గంటల పనిని పిండుకోవడం ముఖ్యం కాదు, వారు ఎంత రీఫ్రెష్‌గా ఉన్నారనేది ముఖ్యం. ఇక 'మెంటల్ హెల్త్ లీవ్స్' ఇవ్వడం, పని వేళల్లో ఒత్తిడి తగ్గించే వాతావరణం కల్పించడం వంటి చర్యలు కంపెనీలు చేపట్టాలి. ఉద్యోగి మానసిక ఆరోగ్యం బాగుంటేనే కంపెనీల ఆర్థిక ఆరోగ్యం కూడా బాగుంటుంది.

యువత కూడా మారాలి:

కంపెనీల బాధ్యత ఎలా ఉందో, యువత కూడా తమ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. రాత్రిళ్లు స్క్రీన్ల ముందు గడపడం తగ్గించి, మెదడుకు సరైన విశ్రాంతిని ఇవ్వాలి. ఇక ఆర్థికంగా ఎదగాలనే పరుగులో ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదని గ్రహించాలి. శారీరక వ్యాయామంతో పాటు మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఈ మానసిక అలసట నుంచి బయటపడటం సాధ్యమవుతుంది.

ముందడుగు వేద్దాం:

యువతలో వస్తున్న ఈ సామాజిక మార్పును మనం సీరియస్‌గా తీసుకోకపోతే దేశ ఆర్థిక భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. కానీ, సమస్యను గుర్తించి అటు కంపెనీలు, ఇటు యువత సరైన జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా మంచి రోజులు వస్తాయి. ఇక మెదడును అలసట నుంచి కాపాడుకుని, చురుకైన ఆలోచనలతో ముందడుగు వేస్తే.. ఇకపై యువతకు కెరీర్ పరంగా, దేశానికి ఆర్థికంగా ఎలాంటి కష్టాలు ఉండవని ఆశించవచ్చు..

Tags:    

Similar News