• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యాత్ర-2 టీజర్.. నేను...

యాత్ర-2 టీజర్.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని..

| ఆంధ్రప్రదేశ్ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లైఫ్ స్టోరీ కథాంశంతో యాత్ర 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-01-05 07:02 GMT

ఆంధ్రప్రదేశ్ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లైఫ్ స్టోరీ కథాంశంతో యాత్ర 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ హీరో జీవా వైఎస్ జగన్ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

టీజర్‌ ను పరిశీలిస్తే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) కొడుకుగా వైఎస్ జగన్ (జీవా) రాజకీయాల్లోకి రావటానికి కారణమేంటనే అంశాన్ని చిన్నహార్ట్ టచింగ్ సన్నివేశంతో చూపించారు. అదే సందర్భంలో తండ్రి లాంటి నాయకుడిని కోల్పోయినప్పుడు వారిని ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చేద్దామంటే నాటి రాజకీయ నాయకులు ఎలాంటి అడ్డంకులు సృష్టించారనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఆ అడ్డంకులను జగన్ ఎలా అధిగమించారు? తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎలా ఎదిగారు? అనేది మిగతా సినిమా.

2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ పరిణామాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు డైరెక్టర్ మహి. ఇందులో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా యాత్ర చిత్రాన్ని తెరకెక్కించారు మహి. అత్యంత ప్ర‌జాద‌ర‌ణను పొందిన ఈ చిత్రానికి సీక్వెల్ గా యాత్ర 2 ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. యాత్ర సినిమాను 2019 ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఇప్పుడు యాత్ర 2ను కూడా అదే తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మవుతోంది.

వైఎస్సార్ మరణించే ముందు పరిస్థితులతో పాటు మరణించాక జరిగిన రాజకీయాలు, జగన్ జైలు జీవితం, పాదయాత్ర, జగన్ సీఎం అవ్వడం.. కథాంశంతో రానుంది యాత్ర 2. ప్రస్తుతం శ‌ర‌వేగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంతోశ్ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

Full View
Tags:    
  • Yatra2teaser 
  • Mammootty 
  • Jiiva 
  • Mahivraghav 
  • Shivameka 
  • Yatra2movie 
  • YSRCP 
  • Jagan 
  • Yatramovie 
  • Ysrajasekharreddy 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS