• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలీవుడ్ రామాయణ.. యష్...

బాలీవుడ్ రామాయణ.. యష్ సిద్ధమే కానీ..?

| యశ్​.. ఈ చిత్రం లో రావణాసురిడి పాత్ర పోషిస్తారని వార్తలు వచ్చాయి. లుక్​ టెస్ట్ కూడా అయిందని కూడా అన్నారు

By - Tupaki Desk
Update: 2023-07-19 08:44 GMT

రామాయణ మహాకావ్యాన్ని సినిమాగా తెరకెక్కించడానికి ఎంతో మంది దర్శకనిర్మాతలు ఆసక్తి కనబరుస్తుంటారు. ఇప్పటికే ఎన్నో సినిమాలూ తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కించిన 'ఆదిపురుష్‌' ఈ మధ్య తెరపైకి వచ్చింది. కానీ బాక్సాఫీస్​ వద్ద నిరాశపరిచింది. అయితే ఇప్పుడు మరో రామాయణం తెరకెక్కేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇందులో కేజీయఫ్ రాఖీ భాయ్​, రాకింగ్ స్టార్ యశ్​ నటించబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా దీని పై ఓ ఆసక్తికర వార్త ఒకటి బయట కు వచ్చింది. అదేంటంటే.. యశ్​ లుక్​ టెస్ట్​కు సిద్ధమయ్యారని తెలిసింది.

విషయం లోకి వెళితే... అఫీషియల్ ​గా కాకపోయినా స్టార్‌ హీరోల సినిమాల కు సంబంధించిన కొన్ని వార్తలు అభిమానుల్లో తెగ అంచనాలు పెంచేస్తుంటాయి. కన్నడ స్టార్​ హీరో యశ్‌ విషయం లోనూ గత కొద్ది కాలం గా అదే జరుగుతోంది. ఇండియన్ సినిమా హిస్టరీ లో కనీవి ని ఎరుగని రీతి లో తెరకెక్కబోతున్న కొత్త 'రామాయణం'లోకి యశ్​ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్​లు ఉన్నాయంటూ వస్తున్న కథనాలు సర్వత్రా ఉత్కంఠ పెంచుతున్నాయి.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, నమిత్‌ మల్హోత్ర, మధు మంతెనలు దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్‌ తో ఆ చిత్రాన్ని నిర్మించాల ని నిర్ణయించుకున్నారు. నితీశ్‌ తివారి దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్.. ఈ ఏడాది చివర్లో సెట్స్​పైకి వెళ్లనుందని ఈ మధ్యే మేకర్స్​ కూడా క్లారిటీ చేశారు.

అయితే కేజీయఫ్‌ , కేజీయఫ్‌-2 చిత్రాల తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్న యశ్​.. ఈ చిత్రం లో రావణాసురిడి పాత్ర పోషిస్తారని వార్తలు వచ్చాయి. లుక్​ టెస్ట్ కూడా అయిందని కూడా అన్నారు. అయితే దీని పై ఆ మధ్యలో యశ్ స్పందించి వార్తలను ఖండించారు. "నేను ఎక్కడికి వెళ్లడం లేదు. అవన్నీ రూమర్స్‌. వాటి గురించి దిగులు పడకండి" అని చెప్పారు. అయితే ఇప్పుడు యశ్ రూట్ మార్చినట్టు తెలిసింది. ఇప్పుడు లుక్ టెస్టుకు సిద్ధమ్యయారని వార్తలు జోరు గా వస్తున్నాయి.

ఈ లుక్​ టెస్ట్ సంతృప్తికరంగా ఉంటే యశ్​.. ఈ భారీ బడ్జెట్​పై ఇంట్రెస్ట్ చూపే అవకాశాలున్నాయని అంటున్నారు. అలాగే యశ్​.. త్వరలోనే తన కొత్త సినిమ ను ప్రకటించి తీపి కబురు వినిపించాలని ఫ్యాన్స్​ కోరుకుంటున్నారు. చూడాలి మరి ఈ రామయణ్​ పై యశ్​ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ఇకపోతే ఇందులో రాముడి గా రణ్​బీర్ కపూర్​, ఆలియా భట్ సీత గా కనిపించనుంది.

Tags:    
  • Yash 
  • Bollywood 
  • Ramayan 
  • LookTest 
  • Ravana 
  • RanbirKapoor 
  • AliaBhatt 

Similar News

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

Copyright @2026

Powered by Blink CMS